వరుస హిట్లతో శర్వానంద్ క్రేజీ హీరోగా మారిపోయాడు. రన్ రాజా రన్… ఎక్స్‌ప్రెస్ రాజా లతో బాక్సాఫీసు దగ్గర శర్వా సినిమాలకు క్రేజ్ పెరిగింది. అలాంటి హీరో సినిమా ఒకటి ఈరోజు విడుదలైంది. ఎలాంటి హడావుడి లేకుండా. శర్వానంద్, నిత్యమీనన్కలసి 2012లో ఓ తమిళ సినిమా చేశారు. చేరన్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ చిత్రానికి తెలుగులో ఏమిటో ఈ మాయ అనే టైటిల్ పెట్టారు. తమిళంలో ఈ సినిమా రిలీజ్ కాలేదు. నేరుగా డీవీడీల్ని విడుదల చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కపోవడం వల్ల డీవీడీల ద్వారా సినిమాని విడుదల చేయాల్సివచ్చిందని దర్శక నిర్మాతలు మొత్తుకొన్నారు. అప్పటి నుంచి ఈ సినిమాని తెలుగులో విడుదల చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ప్రతీసారీ ఏదో ఓ ఆటంకం. ఆ తరవాత ఈ సినిమాకి రాజాధిరాజా అనే పేరు కూడా మార్చారు.
ఎట్టకేలకు ఈరోజు (24 జూన్) న ఈ సినిమా గప్ చుప్ గా వచ్చేసింది. అసలు ప్రమోషనే చేయకుండా బయటకు వదిలారు. నిజానికి ఈ సినిమా విడుదల అవ్వడం శర్వాకి ఏమాత్రం ఇష్టం లేదని టాక్. ఎందుకంటే ఆల్రెడీ తమిళంలో ఫ్లాప్ అయిన సినిమా ఇది. తన ఇమేజ్ పెరుగుతున్న సమయంలో తమిళ ఫ్లాప్‌ని తెలుగులో విడుదల చేయడం.. శర్వాని ఇబ్బంది పెట్టే విషయమే. దాంతో పాటు.. తెలుగు నిర్మాతలతో శర్వా డీలింగ్స్ ఏనాడో కట్ అయిపోయాయి. కనీసం ప్రమోషన్ కూడా చేయడం లేదన్నది శర్వా అభియోగం. ఒక వేళ చేసినా `నేను రాను` అని కచ్చితంగా చెప్పేశాడట. ఆఖరికి శర్వానంద్‌కి రిలీజ్ డేట్ చెప్పకుండా నిర్మాతలు ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు టాక్. తన సినిమా బయటకు వస్తుంటే ఏ హీరోకైనా ఆనందం కలుగుతుంది. కానీ శర్వాకి మాత్రం.. సీన్ రివర్స్ అయ్యింది.
మరి రాజాధిరాజా రిజల్ట్ ఎలా ఉంటుందో?? ఏంటో??