ఓ పోయిందంటే ఎన్ని కారణాలు అనుకుంటారో.. సినిమా హిట్ అయితే కూడా అలానే కొన్ని కారణాలను పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం శర్వానంద్ కూడా దాన్నే నమ్ముతున్నాడు. సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాల తోడ తన సినిమాను వదిలి హిట్ కొట్టిన ఈ హీరో తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఓ ఫోన్ కాల్ ద్వారా వచ్చిందని అన్నాడు. ఓ సీనియర్ నటుడు తనకు ఫోన్ చేసి ఓ మంచి కథ ఉంది వింటావా అనగానే తాను విన్నానని అదే ఈరోజు ఎక్స్ ప్రెస్ రాగాగా హిట్ వచ్చిందని అంటున్నాడు.
ఇటీవల జరిగిన ఎక్స్ ప్రెస్ రాజా సక్సెస్ మీట్ లో సినిమా చేయడానికి గల కారణాలు బయటపెట్టాడు. సీనియర్ నటుడు బ్రహ్మాజి ఫోన్ చేయబట్టే సినిమా కథ విన్నానని.. అదే ఆ కాల్ నాకు చేయకుంటే సినిమా మిస్ అయ్యేవాడినని అన్నాడు. శర్వానంద్, సురభి జంటగా నటించిన ఎక్స్ ప్రెస్ రాజా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. యు.వి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.
సినిమా సినిమాకు తనలోని విలక్షణతను చూపిస్తూ సరికొత్త కథ కథనాలతో ముందుకొస్తున్న శర్వానంద్ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించగలిగాడు. ఇక మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ హిట్ తో వచ్చిన క్రేజ్ ను రెండో సినిమాకు సరిగ్గా వాడుకుని ఎక్స్ ప్రెస్ రాజాని కూడా హిట్ చేసుకున్నాడు దర్శకుడు మేర్లపాక గాంధి. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయిన కారణం చేత అదే బ్యానర్లో తన మూడో సినిమా కూడా ఒకే అయ్యిందని తెలుస్తుంది.