రాజ్ తరుణ్‌తో దిల్‌రాజు ఓ సినిమా చేద్దామని ప్లాన్ చేసుకొన్నాడు. సతీష్ వేగ్నేశ ఈ చిత్రానికి దర్శకుడు. స్ర్కిప్టు అంతా ఓకే అయిపోయింది. ఈ సినిమాకి శతమానం భవతి అనే పేరు కూడా ఖరారు చేసేశారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి రాజ్ తరుణ్ తప్పుకొన్నాడు. ప్లేసులో శర్వానంద్ వచ్చి షాక్ ఇచ్చాడు. రాజ్ తరుణ్ తానంతట తాను తప్పుకోలేదని, దిల్‌రాజు తరుణ్‌ని పక్కన పెట్టాడని తెలుస్తోంది.
కుమారి 21 ఎఫ్ కంటే ముందే.. దిల్‌రాజు తో సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకొన్నాడు తరుణ్. అయితే వరుస విజయాలు చూసుకొని, పారితోషికం పెంచేశాడట రాజ్. పాత లెక్కల ప్రకారమే పారితోషికం ఇస్తానని దిల్‌రాజు, కాదు.. పెరిగిన రేటే ఇవ్వాలని రాజ్ తరుణ్ ఇద్దరికీ మాటా మాటా పెరిగి.. ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యే వరకూ వెళ్లిందట వ్యవహారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 2017 సంక్రాంతికి శతమానం భవతిని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ షాక్‌తో అయినా రాజ్ తరుణ్ తేరుకొని, పారితోషికం విషయంలో కిందకు దిగొస్తాడేమో చూడాలి.