వరుస హిట్లతో జోరుమీదున్నాడు శర్వానంద్. ఇక తన రేంజు పెంచుకోవాల్సిన తరుణం ఏర్పడింది. దర్శకుల్ని ఎంచుకొనేటప్పుడు, కథానాయికల్ని ఎంపిక చేసుకొనేటప్పుడు కాస్త ఆచితూచి ఉండాల్సిందే. ఈవిషయం శర్వానంద్కీ తెలుసు. హిట్టున్న దర్శకుడు, రేంజులో ఉన్న హీరోయిన్లతో ప్రయాణం చేస్తే శర్వా కెరీర్ ఇంకాస్త స్పీడుగా ముందుకెళ్తుంది. అయితే.. శర్వా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముందు నుంచీ కథానాయికల ఎంపికలో తప్పులు చేస్తూనే ఉన్నాడు శర్వానంద్. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా మిస్ మ్యాచింగ్ కనిపిస్తుంటుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. శర్వానంద్ హీరోగా చంద్రమోహన్ చింతాడా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. బీవీఎస్ ఎన్. ప్రసాద్ ఈ సినిమా. ఈసినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నారు. ఓ కథానాయికగా లావణ్య త్రిపాఠిని ఎంపిక చేశారు. రెండో హీరోయిన్ గా ‘అక్షని తీసుకొన్నారు. కందిరీగ లాంటి హిట్టున్నా.. అక్ష తన కెరీర్‌ని సరైన దారిలో మళ్లించలేకపోయింది. శ్రీలాంటి చిన్న హీరోతోనూ ఎడ్జస్ట్ అయి నటించింది. అక్షకి హిట్లు లేవు. దానికితోడు బొద్దుగా మారుతోంది. డిక్టేటర్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్‌తో సరిపెట్టుకొంటోంది. అక్ష సంగతిని దాదాపు అందరూ మర్చిపోతున్న తరుణంలో కథానాయిగా తీసుకొన్నాడు శర్వా. తను కోరుకొంటే ఓ మాదిరి రేంజున్న హీరోయిన్లు దొరుకుతారు. నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్‌కీ ఆ స్టామినా ఉంది. కానీ.. ఫేడవుట్ అయిపోయిన కథానాయికనెందుకు తీసుకొన్నారో..??