అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకునాడు హను రాఘవపూడి. అందాల రాక్షసి సినిమాకి డబ్బులు రాలేదు కానీ, మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’తో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఐతే ఈ మధ్య నితిన్ తో చేసిన ‘లై’ సినిమా మాత్రం నిరాశ పరిచింది.
అయితే హనుపై యువ హీరోలకు నమ్మకం వుంది. ఇప్పుడు శర్వానంద్, హనుతో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ ను లాక్ చేశారని తెలిసింది. డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. క్రేజీ స్టార్ బానుమతిని హీరోయిన్ గా అనుకుంటున్నారు. అదే .. సాయి పల్లవి. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును హోల్ సేల్ గా దోచేసిన సాయిని ఈ సినిమా కోసం పరిశీలించడం, ఆమె ఓకే చెప్పడం జరిగిందని తెలిసింది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.