స్కై డైవింగ్‌లో శిక్షణ పొందుతూ కథానాయకుడు శర్వానంద్ గాయపడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సన్‌షైన్ ఆసుపత్రిలో శర్వా చికిత్స పొందుతున్నాడు. ఈ ఉదయం శర్వానంద్ భుజానికి ఆపరేషన్ చేశారు. దాదాపు 11 గంటల పాటు ఆపరేషన్ సాగింది. ఆ వెంటనే శర్వాని డాక్టర్లు ఐసీయూని తరలించారు. శర్వాకు కనీసం 2 నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. మరో నాలుగు రోజుల పాటు శర్వా ఆసుపత్రిలోనే ఉండాల్సివస్తోంది. శర్వాకి తగిలిన గాయం పెద్దదే అని, అందుకే ఆపరేషన్‌కి సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న `రణరంగం` సినిమా దాదాపుగా పూర్తయిపోయింది. తమిళ రీమేక్ `96` ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. శర్వా గాయంతో… ఈరెండు సినిమాలూ ఇబ్బందులో పడ్డాయి. శర్వా గాయం నుంచి కోలుకున్న తరవాతే… `96` షూటింగ్ మొదలవుతుంది.