భలే మంచి రోజుతో దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించాడు శ్రీరామ్ ఆదిత్య. ఆసినిమా మంచి ఫలితాన్నే అందించింది. ఆ వెంటనే శమంతకమణితోనూ ఆకట్టుకున్నాడు. నాగార్జున, నానిలతో చేసిన మల్టీస్టారర్ `దేవదాస్` ఓకే అనిపించుకుంది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. శర్వానంద్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నాడట శ్రీరామ్ ఆదిత్య. ఇటీవలే శర్వాకి లైన్ చెప్పి ఓకే చేయించుకున్నాడని టాక్. సాధారణంగా శర్వాకి ఏ కథా సింగిల్ సిట్టింగ్‌లో నచ్చదు. కానీ… శ్రీరామ్ మాత్రం సింగిల్ సిట్టింగ్‌తోనే కథ ఓకే చేయించుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సుధీర్ వర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు శర్వానంద్. ఫస్ట్ లుక్ శనివారం సాయింత్రం విడుదల చేస్తున్నారు. `దళపతి` అనే పేరు పరిశీలనలో ఉంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే…. శ్రీరామ్ ఆదిత్య కాంబోనే సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.