తన విలక్షణ నటనతో తెలుగు ప్రేక్షకుల్లో ఓ సరికొత్త ఇమేజ్ ను ఏర్పరచుకున్న హీరో కాదు కాదు నటుడు శర్వానంద్. ఏ పాత్రైనా సరే దానికి తగ్గ నటనకు కనబరుస్తూ సినిమాలను వరుసెంట హిట్టు మీద హిట్టు కొడుతున్న శర్వానంద్ ఇప్పటి వరకు చిన్న దర్శకులతోనే పనిచేయడం జరిగింది. అయితే తనకు స్టార్ డైరక్టర్స్ తో చేయాలని ఉంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఈ హ్యాట్రిక్ హీరో.
మణిరత్నం, రాజమౌళి, త్రివిక్రం శ్రీనివాస్ లాంటి దర్శకులతో చేయాలని ఉందని.. అంతకంటే ముందు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉందని అంటున్నాడు శర్వానంద్. పూరి సినిమాల్లో హీరో క్యారక్టరైజేషన్ అదరగొట్టేలా ఉంటుందని.. చాలా పవర్ ఫుల్ గా కనిపించే అలాంటి పాత్రలో తనని తాను చూసుకోవాలనే ఆలోచనతో పూరి దర్శకత్వంలో ఛాన్స్ వస్తే చేస్తా అంటున్నాడు శర్వా. ఇక రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా మూడు హిట్స్ తో రెమ్యునరేషన్ పెంచారా అన్న ప్రశ్నకు సమాధానం గా తాను సినిమాలు చేసుకుంటూ పోతున్నానని.. రెమ్యునరేషన్ పెంచేది తాను కాదని నిర్మాతలే పెంచేస్తున్నారని అంటున్నాడు.
హ్యాట్రిక్ హిట్స్ కొట్టినా సరే గమ్యం, ప్రస్థానం సినిమాలు ఇచ్చిన కిక్ ఈ సినిమాలు ఇవ్వలేదని అంటున్నాడు. మరి కెరియర్ సూపర్ గా ప్లాన్ చేసుకుంటూ హిట్స్ మీద హిట్స్ కొడుతున్న శర్వానంద్ చేయబోయే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ కొట్టాలని కోరుకుందాం.