శర్వానంద్ కి బాగా కలిసొచ్చిన బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఫాపుల్లో వున్న శర్వాకి ఊపు తెచ్చిన బ్యానర్ యూవీ క్రియేషన్స్ . రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా హిట్ల తర్వాత శర్వనంద్ గ్రాఫ్ మారిపోయింది. తర్వాత వరుసగా కొన్ని ప్రామిసింగ్ సినిమాలు చేశాడు. ఐతే ఇప్పుడు మళ్ళీ శర్వాకి ఫ్లాపులు చుట్టుముడుతున్నాయి. రణరంగం, శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు.. ఇలా అన్నీ ఎదురుదెబ్బలే. ఎంతో నమ్మకంగా చేసిన96 రీమేక్ జాను కూడా నిరాశ పరిచింది.
ఇప్పుడు శర్వా మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన కలసి రావాడం లేదు. ఇప్పుడు మళ్ళీ ట్రాక్ లోకి రావాలి. అలా రావాలంటే ఒక హిట్ పడాలి. అలా హిట్ ఇచ్చే బ్యానర్ యువీనే అనే నమ్మకంతో వున్నాడు. యువీ క్రియేషన్స్ ఒక విధంగా శర్వాకి సొంత బ్యానర్ లాంటింది. ఆ బ్యానర్ తో మంచి అనుబంధం వుంది శర్వాకి. అందుకే ఇప్పుడు మళ్ళీ యూవీలోనే సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. శర్వా కోరిక మేరకు మంచి కథని ఫైనల్ చేసే పనిలో వున్నారు నిర్మాతలు. ప్రస్తుతం శర్వా చేతిలో ఒకే జీవితం సినిమా మాత్రమే. ఇదీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు శర్వా ద్రుష్టి మొత్తం యువీతో చేయబోయే సినిమాపైనే వుంది.