ఇది వరకు శర్వానంద్ సినిమాలు చాలా సీరియెస్‌గా సాగేవి. ప్రస్థానం, అమ్మ చెప్పింది, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు… ఇలా మంచి కథలే ఎంచుకొన్నా అవన్నీ సిరియెస్ సబ్జెక్టు. క్రమంగా ఎంటర్టైన్వైపు దృష్టి మళ్లించాడు శర్వా. అక్కడి నుంచి వరుసగా విజయాలు అందుకొంటున్నాడు. తాజాగా `రాధ`కూడా కంప్లీట్ ఎంటర్టైనరే. ‘రాధ’ ట్రైలర్ లేటెస్టుగా విడుదలైంది. రెండు గంటల పాటు వినోదం అందించే మేటర్ ఈ సినిమాలో ఉన్నదన్న విషయం రెండు నిమిషాల ట్రయిలర్ చూస్తే అర్థం అవుతోంది. కామెడీ టైమింగ్‌తో ఆద్యంతం అదరగొట్టేశాడు శర్వానంద్. రధన్ నేపథ్య సంగీతం ఫుల్ జోష్‌తో సాగింది. పంచ్‌లూ బాగానే పడ్డాయి. అయితే గబ్బర్‌సింగ్, రేసుగుర్రంలోని క్లైమాక్స్ ఎపిసోడ్స్ గుర్తొస్తున్నాయి.. రాధ టీజర్ చూస్తుంటే. కథ పాతదే అయినా.. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటే చాలు. గట్టెక్కేయడానికి. దానికి తోడు బాహుబలి 2 తప్ప జనాల ముందు మరో ఆప్షన్ లేకుండా పోయింది. రాధ.. రెచ్చిపోవడానికి ఇదే సరైన సమయం.