`రణరంగం` విడుదలకు రెడీ అవుతోంది. `96` సెట్స్‌పై ఉంది. ఈలోగా మరో సినిమాకి `శ్రీకారం` చుట్టేశాడు శర్వానంద్. 14 రీల్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం `శ్రీకారం`. ఈరోజు హైదరాబాద్‌లో లాంఛనంగా మొదలైంది. ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకుడు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆగస్టు తొలి వారంలో సెట్స్‌పైకి వెళ్లుంది. 2020 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సంక్రాంతి బరిలో చాలా సినిమాలే ఉన్నాయి. మహేష్‌బాబు, అల్లు అర్జున్ చిత్రాలు పండక్కి రాబోతున్నాయి. సాయిధరమ్ తేజ్ `ప్రతి రోజూ పండగే` కూడా సంక్రాంతి సినిమానే. ఇప్పుడు `శ్రీకారం` కూడా బరిలో దిగబోతోంది. ఇంత పెద్ద పోటీని శర్వా ఎలా తట్టుకోగలడో చూడాలి. రెండేళ్ల క్రితం పెద్ద సినిమాలో పోటీ పడి `శతమానం భవతి`ని సూపర్ హిట్ చేసుకున్నాడు శర్వా. అదే ధీమాతో ఈసారీ పండక్కి రాబోతున్నాడేమో.?