రణరంగం, పడి పడి లేచె మనసు సినిమాలతో వరుస ఫ్లాపులు మూటగట్టుకున్నాడు శర్వానంద్. జానూలో శర్వా నటన బాగానే ఉన్నా, కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు తన ఆశలన్నీ… `శ్రీకారం` సినిమాపైనే. కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. ప్రియాంకా మోహన్ కథానాయిక. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో శర్వా.. రైతుగా కనిపించబోతున్నాడు. రైతుల సమస్యని ప్రధానంగా ఎంచుకుని తెరకెక్కించిన చిత్రమిది.
ఈ సినిమా రషెష్ చూసుకుంటే శర్వాకి కొన్ని లోటు పాట్లు కనిపించాయట. లవ్ స్టోరీ మరీ డల్‌గా ఉందని అనిపించిందట. అలా డల్‌గా అనిపించిన సన్నివేశాల్ని మళ్లీ కొత్తగా రాసుకుని తెరకెక్కిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉంది చిత్రబృందం. పైగా సినిమాని మరింత షార్ప్‌గా కట్ చేయాలని భావిస్తున్నారు. సందేశాల పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు లేకుండా కొన్ని చోట్ల… బాగా ట్రిమ్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ఇటీవలత బయటకు వచ్చింది. లుంగీ కట్టిన శర్వా.. గెటప్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సందేశంతో పాటు వినోదాన్ని, ఓ మంచి ప్రేమకథనీ ఇందులో మిళితం చేశార్ట. ప్రస్తుతం వాటికి సంబంధించిన రిపేర్లే మొదలయ్యాయి.