బీహార్‌కు చెందిన సినీనటుడు శతృఘ్ను సిన్హా ను బెంగాల్‌లోని అసన్ సోల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని మమతా బెనర్జీ నిర్ణయించారు. ఉపఎన్నికల షెడ్యూల్ రావడంతో ఈ మేరకు అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించేశారు. అసన్సోల్ నియోజవవర్గాన్ని బాలీవుడ్ సింగర్ బాబుల్ సుప్రియో ఖాళీ చేశారు. బీజేపీ తరపున గెలిచిన ఆయన అసెంబ్లీ ఎన్నికల తర్వతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి లోక్‌సభకు రాజీనామా చేశారు. స్పీకర్ ఆమోదించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది.
అలాగే.. మమతా బెనర్జీ కేబినెట్లోని మంత్రి హఠాన్మరణం చెందడంతో కోల్‌కతాలోని ఓ నియోజకవర్గం అయిన బల్లీ గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బాబుల్ సుప్రియోకు మమతా బెనర్జీ చాన్సిచ్చారు. శతృఘ్ను సిన్హా బీజేపీలో కీలకంగా ఉండేవారు. ఓ దశలో బీహార్‌లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా పేరు తెచ్చుకున్నారు. అయితే పార్టీలో మోడీ, షాల హవా ప్రారంభమైన తర్వాత ఆయనను పట్టించుకోవడం మానేశారు. దాంతో ఆయన మెల్లగా పార్టీకి దూరమయ్యారు. మోదీ , అమిత్ షాలపై తరచూ విమర్శలు కూడాచేస్తూ వచ్చారు. చివరికి ఆయన తృణమూల్ పార్టీలో చేరిపోయారు.
బీహార్‌కు చెందినప్పటికీ.,. శతృఘ్న సిన్హాకు బెంగాల్లోనూ మంచి గుర్తింపు ఉంది.ఈ కారణంగా ఆయనను లోక్‌సభకు పంపాలని.. మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. అసన్ సోల్ పరిధిలో గతంలో బీజేపీ తరపున సుప్రియో గెలిచారు. కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ హవా కనిపించింది. అందుకే ఈ సారి షాట్ గన్ విజయం ఖాయమని నమ్ముతున్నారు.