ఇంటింటికి మంచినీరు ఇచ్చేందుకు కేంద్రం జల్ జీవన్ మిషన్ అనే పథకం తెచ్చింది. రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది. అందరూ తీసుకుని తమ ప్రజలకు మంచినీటి సదుపాయం.. ఇంటింటికి ట్యాప్ ఇచ్చేందుకు ప్రయత్నించాయి…కానీ ఈ జాబితాలో ఒకే ఒక్క రాష్ట్రం మాత్రం.. మా ప్రజలకు తాగునీరు అక్కర్లేదు.. మీ నిధులు అక్కర్లేదు అని తేల్చేసింది. ఆ రాష్ట్రం ఏదో అయితే మనం చెప్పుకోవాల్సిన పని ఏపీనే.
ఏపీ నిర్వాకం గురించి కేంద్ర మంత్రి షెకావత్ పార్లమెంట్ లో స్వయంగా చెప్పారు. ఏపీ పరిస్థితి చూస్తూంటే బాధేస్తోందన్నారు. ప్రజలకు మంచినీరిచ్చేందుకు ఉద్దేశించిన జల్ జీవన్ మిషన్ కింద ఒక్క రూపాయి వినియోగించుకోలేదన్నారు. మంత్రిగారు చెప్పిన మాట విని.. ఆయనకెందుకు బాధ అని ఎవరికైనా అనిపించవచ్చు. ఎందుకంటే… ఏపీలో ఒక్కరైనా దీనిపై మాట్లాడేవారు లేరు మరి. ఓటర్లకు లేని బాధ… కేంద్ర మంత్రికెందుకని ప్రశ్నించే వారు కూడా కనిపిస్తున్నారు.
మామూలుగా అయితే ఇలాంటి చాన్స్ వస్తే నిధులు తీసేసుకుని జగన్ రెడ్డి బటన్ నొక్కేసి ఉండేవారు. కానీ ఈ పథకంలో మ్యాచింగ్ గ్రాంట్ గా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం పెట్టాలి. అంతే కాదు.. నిధులు నొక్కేయడానికి చాన్స్ ఉండదు. జల్ జీవన్ మిషన్ కే ఖర్చు చేయాలి. అందుకే… కేంద్రం ఎంత ఇస్తే ఏమి..తాము మ్యాచింగ్ గ్రాంట్ గా పెట్టే ప్రశ్నే లేదని తేల్చింది. వారికేమీ పోయింది…. హిమాలయ మినరల్ వాటర్ ను తెచ్చుకుంటారు. పేద ప్రజలు మాత్రం… దొరికిన నీరు తాగాల్సిందే. ప్రశ్నిస్తే పథకాలు రావాయే మరి !