జయరాం హత్య కేసులో శిఖాచౌదరి పాత్రకు ఆధారాలు దొరకలేదని.. ఏపీ పోలీసులు అనగానే… అసలు.. ఏపీ పోలీసులపై నమ్మకం లేదని.. తెలంగాణ పోలీసులకు కేసు అప్పగించాల్సిందేనన్న డిమాండ్లు గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు తెలంగాణ పోలీసులు.. నెలల తరబడి విచారణ చేసి.. హత్య కేసులో శిఖా చౌదరికి సంబంధం లేదని తేల్చారు. ఈ మేరకు.. సీక్రెట్ గా.. కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. సంచలనం సృష్టించిన ఎన్నారై హత్య కేసులో.. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డేనని పోలీసులు తేల్చారు. చార్జిషీట్లో ఇతర నిందితులుగా ఎవరున్నారో కానీ… రాకేష్ రెడ్డి ఇంటికి అంతకు ముందు రెండు రోజుల పాటు కార్మిక సంఘ నాయకుడిగా ఉన్న టీడీపీ నేత బీఎన్ రెడ్డి వెళ్లారని.. ఆ కోణంలో.. ఆయనను కూడా నిందితునిగా చేర్చినట్లు ప్రచారం జరుగుతోంది. రేపోమాపో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారంటున్నారు.
ఇక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించమని… రాకేష్ రెడ్డికి సలహా ఇచ్చిన పోలీసు అధికారుల గురించి.. చార్జిషీట్లో ప్రస్తావించారో లేదో క్లారిటీ లేదు. మొత్తానికి.. జయరాం హత్య కేసు … ప్రధానంగా… వార్తల్లోకి రావడానికి కారణం శిఖా చౌదరి. ఆమె లైఫై స్టైల్. బ్యాక్ గ్రౌండ్.. అన్నీ… కలిపి.. ఈ కేసులో ఆమెపై.. ఎన్నో అనుమానాలు కలిగేలా మీడియాలో కథనాలు వచ్చాయి. చివరికి.. జయరాం భార్య కూడా.. శిఖాచౌదరిపైనే ప్రధానంగా అనుమానం వ్యక్తం చేశారు. చివరికి.. అటు ఏపీ పోలీసుల దర్యాప్తులోనూ.. ఇటు తెలంగాణ పోలీసుల దర్యాప్తులోనూ… శిఖా చౌదరి పాత్రేమీ లేదని పోలీసులు తేల్చారు.
అయితే.. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి. శిఖా చౌదరికి స్నేహం ఉందని.. గతంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా.. .తర్వాత విడిపోయారని గుర్తించారు. అయితే.. ఈ కేసులో.. వారిద్దరి మధ్య గతంలో ఉన్న స్నేహం.. విషయం కాదని పోలీసులు తేల్చారు. చివరికి జయరాం హత్య కేసు ఎలాంటి మలుపులు లేకుండా పోలీసులు ముగించారు. అనేక లీకులు… అనేక నోటీసుల తర్వాత… చివరికి చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో.. అందరూ అనుకున్నట్లుగానే శిఖా చౌదరికి ఏమీ సంబంధం లేదని బయటపడింది.