బాలీవుడ్ తారలు పైకి ఎలా కనిపిస్తారో కానీ.. అంతర్గతంగా ఎంత మురికిగా ఉంటారో చెప్పడం కష్టం. దానికి తాజాగా హీరోయిన్ శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారమే సాక్ష్యంగా కనిపిస్తోంది. ఆయన .. పోర్న్ వీడియోలు తయారు చేయించి.. యాప్స్‌లో అప్ లోడ్ చేయించి డబ్బులు సంపాదిస్తున్నట్లుగా ముంబై పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల కిందట… యాప్స్‌లో పోర్న్ వీడియోల అప్ లోడింగ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ నటిని అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర తీగ లాగితే.. రాకెట్ మొత్తం… శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా వద్ద తేలినట్లుగా గుర్తించారు.
సాంకేతిక ఆధారాలు మొత్తం సేకరించిన పోలీసులు … రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. ప్రస్తుత టెక్ ప్రపంచంలో… యాప్స్ ద్వారా పోర్న్ అమ్ముకోవడం పెద్ద వ్యాపారం అయిపోయింది. గతంలో వీడియో క్యాసెట్లు రూపొందించేవారు. కానీ ఇప్పుడు.. నేరుగా యాప్స్‌నే పెట్టేస్తున్నారు. సినీ రంగంలోకి రావాలనుకునే అమ్మాయిలకు ఆశలు చూపి.. వారిని వ్యాపారానికి వాడుకుంటున్నారు. రాజ్ కుంద్రా కేసు ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
అయితే ఇలాంటి హైప్రోఫైల్ కేసులు… ఇలా ప్రారంభమై.. అలా మూసుకుపోతాయని.. తర్వాత అంతా నార్మల్ అవుతుందని.. కొంత మంది గుర్తు చేస్తున్నారు. రాజ్ కుంద్రా శిల్పాషెట్టిని ద్వితీయవివాహం చేసుకున్నారు. తన మొదటి భార్యపై అక్రమ సంబంధం ఆరోపణలు చేసి.. ఇటీవల ఆయన వార్తల్లోకి ఎక్కారు. ఇప్పుడు నేరుగా బ్లూ ఫిల్మ్స్ బిజినెస్‌తో హైలెట్ అయి జైలుపాలయ్యారు.