రంగస్థలం సినిమా నిన్న విడుదల అయి సూపర్ హిట్ టాక్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకంటే ముందే ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అవడం కూడా తెలిసిందే. అయితే సినిమాలలో చూసిన వాళ్లు ఒక పాట విషయంలో కాస్త నిరుత్సాహపడ్డట్టు తెలుస్తోంది.
విషయానికొస్తే, ఈ సినిమాలో ఎన్నికల ప్రచారసమయంలో వచ్చే ఒక పాట ఉంది. “ఆ గట్టున ఉంటావా నాగన్న.. ఈ గట్టుకి వస్తావా ” అని సాగే ఆ పాట కథలో భాగంగా వస్తోంది. ఈ పాట ఆడియో లో శివ నాగులు అనే జానపద గాయకుడితో పాడించిన వెర్షన్ ఉంది. అయితే సినిమాలో కి వచ్చేసరికి ఈ పాట దేవిశ్రీప్రసాద్ గొంతుతో వినిపించింది. అయితే అప్పటికే శివ నాగులు పాటని విని ఉన్నవాళ్లు, దానికి ఆల్రెడీ అలవాటయి ఉండటంతో, దేవి గొంతుతో కాస్త నిరుత్సాహ పడ్డారు. అదీ కాక ఆ సందర్భానికి, ఆ పాట కి, శివ నాగులు గొంతులో ఉన్న పల్లెటూరి తరహా “rawness” ఈ పాటకి ఖచ్చితంగా అసెట్ అయి ఉండేది అనడంలో ఎటువంటి సందేహములేదు. మరి అంత బాగా ఉన్న, ఆల్రెడీ జనాలకు అలవాటయిన, శివ నాగులు గొంతు కాదని దేవిశ్రీ ఎందుకు తన గొంతుతో మరొకసారి ఈ పాటను పాడి సినిమాలో వినిపించినట్లు అనేది దేవిశ్రీ కి , దర్శకుడికి మాత్రమే తెలుసుండాలి