దుబ్బాక ఉపఎన్నికల్లో ఫలితంపై వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ భిన్నమైన ఫలితాలను ఇచ్చాయి అయితే.. ఊరూపేరూలేని సంస్థలు ఎవరిపై అభిమానం ఉంటే వారికి విజయాన్ని కట్ట బెట్టాయి. అయితే అంతో ఇంతో నమ్మదగిన సర్వే సంస్థ మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీకి విజయం దక్కింది. 51.82 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు తొలిస్థానం వస్తుదని.. 35.67 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు రెండోస్థానం వస్తుందంని.. 12.15 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడోస్థానం వస్తుందని మిషన్ చాణక్య తెలిపింది.
ఆరా అనే సంస్థ చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో 48.72 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానం వస్తుందని తేల్చారు. పోటీ .. హోరాహోరీగా జరిగిందని.. 44.64 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండోస్థానం వస్తుందని తెలిపారు. ఓవరాల్‌గా చూస్తే దుబ్బాకలో టీఆర్ఎస్కు ఎదురు గాలి వీచిందని.. బీజేపీకి మంచి రోజులు వచ్చాయన్న విషయం మాత్రం క్లారిటీగా ఉంది. హరీష్ రావు ప్రచారం చేసినట్లుగా.. లక్ష మెజార్టీ కాదు కదా.. లక్ష ఓట్లు రావడం కూడా కష్టమేనని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
బీజేపీ జపం చేసిన టీఆర్ఎస్.. ఆ పార్టీకి అనుకోకుండానే మేలు చేసిందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఎగ్జిట్‌పోల్ ఫలితాలు కొన్ని సందర్భాల్లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉన్నప్పటికీ, చాలాసార్లు బోల్తా పడిన సందర్భాలున్నాయి. దేశంలో ఇతర చోట్ల జరిగిన ఎన్నికలతోపాటుగా ఉపఎన్నిక కౌంటింగ్ కూడా పదో తేదీన జరగనుంది.