వైసీపీ పార్టీ ఖాతాలో రూ. 27 కోట్లు మాత్రమే ఉన్నాయని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ సమాచారం ఇచ్చింది. ఈ లెక్క చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వందల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఏమయిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఖాతాల్లో రూ. 1449 కోట్లు ఉన్నట్లుగా ఆ పార్టీకి ఈసీకి సమాచారం ఇచ్చింది. మరి వైసీపీ ఖాతాల్లో నగదు ఏమయ్యాయి?. గతంలో ఆ పార్టీ ఖాతాల్లో నాలుగు వందల కోట్ల వరకూ ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. లాటరీ కింగ్ శాంటియాగో ఒక్కడే రూ. 150 కోట్లు ఇచ్చారు. ఇదంతా ఎటుపోయింది?
వైసీపీ ఓడిపోయిన తర్వాత జగన్ రెడ్డి పార్టీ ఫండ్స్ ను మొత్తం తరలించేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి పదకొండుమంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు.మహారాష్ట్ర ఫార్ములా ప్రకారం చూస్తే…పెద్దిరెడ్డో లేకపోతే మరో ఎమ్మెల్యేనో ఆరేడుగుర్ని తీసుకుని బయటకు పోయి పాప్టీ తనదే అంటే.. ఎవరేం చేయలేరు. పార్టీ వారిదే అవుతుంది. పార్టీ ఖాతాలు వారివే అవుతాయి. అప్పుడు జగన్ .. వైసీపీ జగన్ అనే కొత్త పార్టీ పెట్టుకోవాల్సి వస్తుంది.
అలాగే తల్లి, చెల్లి కూడా దూరమైపోవడంతో.. తన పార్టీ తన చేతుల్లోనుంచి జారిపోయే ప్రమాదం ఉందన్న కారణంతో ముందస్తుగానే ఖాతాల్ని ఖాళీ చేసి కొద్ది మొత్తం ఉంచారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కొద్దిమొత్తంతో పార్టీని ఎలా నడుపుతారన్న ప్రశ్న వస్తుంది. నిజానికి వైసీపీ లెక్కలు చూస్తే పార్టీ నడపడానికి ఏ మాత్రం ఖర్చు పెట్టరు. అయ్యేఖర్చు అంతా ఇతరుల మీద తోసేస్తారు. ఇప్పుడు పార్టీ ఖాతాల్లో సొమ్ము ఏమయిందో ఎవరు లెక్క తేలుస్తారు ?