వరుణ్ తేజ్ సినిమా ‘గని’ కోసం పెట్టిన బడ్జెట్ ఫిగర్ ఆసక్తికరంగా వుంది. దాదాపు రూ. 50 కోట్లు ఈ సినిమా కోసం పెట్టారు. ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కిరణ్ చాలా సినియర్. ‘ఆది’ సినిమా నుంచి ఆయన ఇండస్ట్రీలో వున్నారు. అయితే దర్శకుడిగా మాత్రం ఇదే ఆయనకి తొలి సినిమా. మొదటి సినిమా డైరెక్ట్ చేస్తున్న దర్శకుడిని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం ఈ మధ్య కాలంలో జరగలేదు. ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నదియా లాంటి భారీతారాగణం తీసుకున్నారు. ఒక ఐటెం సాంగ్ కోసం తమన్నాకే కోటి రూపాయిలిచ్చారని తెలిసింది. దానితో పాటు సరిగ్గా కరోనా కాలంలో మొదలైయింది ఈ సినిమా. చాలా బ్రేకులు పడ్డాయి. ఫారిన్ నుంచి బాక్సరలని పిలిపించారు. అన్నపూర్ణలో సెట్ వేశారు. వరుణ్ కి గాయం కావడంతో షూటింగ్ రద్దు చేశారు. దీంతో మళ్ళీ ఫారిన్ నుంచి బాక్సర్ లని తెప్పించడం, సెట్ వేయడం డబుల్ బడ్జెట్ అయ్యింది. ఇలా సినిమా యాబై కోట్లకి చేరిపోయింది.
యాభై కోట్లు.. వరుణ్ తేజ్ సినిమాల్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ వస్తే తప్పితే వరుణ్ సినిమా యాబై కోట్ల మార్క్ ని అందుకోవడం కష్టం. ఫిదా అంటే శేఖర్ కమ్ముల, సాయి పల్లవి .. ఇలా అంత వున్నారు. గనికి మాత్రం వరుణ్ తేజ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓకే .. కానీ తేడా కొడితే మాత్రం కష్టం. అయితే అల్లు అరవింద్ ప్లాన్స్ ఆయన దగ్గర వున్నాయి. థియేటర్ రైట్స్ అన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నారు. ‘ఆహా’ ఓటీటీ వుంది. పైగా ‘గని’ నాలుగు భాషలలో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డబ్బింగ్, శాటిలైట్.. అన్నీ లెక్కలు వేసుకొని ‘గని’ పై ధీమాగానే వున్నారు అరవింద్. అయితే రూ. 50కోట్లు వెనక్కి రావాలంటే మాత్రమే ‘గని’ వరుణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి.