భారతదేశంలో ఉన్న మిగతా ప్రజలందరూ అసహనం ఫీలవుతున్నారో, లేదో తెలియదు కానీ ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోస్ మాత్రం తీవ్రమైన అసహనాన్ని ఫీలవుతున్నారు. అంతకుముందు వరకూ ఈ ఖాన్ హీరోస్ ముగ్గురూ ఏం చెప్పినా, ఏం చేసినా మహా అయితే ఒకటి రెండు రోజులు విమర్శించేవాళ్ళు. ఆ తర్వాత మర్చిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఖాన్స్ మాటలు, చేతలను దేశం మొత్తం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. అది కాస్తా ఈ హీరోలను జీరోలుగా మారుస్తోంది. సోషల్ మీడియా పీపుల్ చాలా యాక్టివ్‌గా ఉండడం కూడా ఖాన్స్ కష్టాలకు కారణమవుతోంది.
దేశంలో అసహనం గురించి అప్పట్లో రెచ్చిపోయి మాట్లాడారు అమీర్, షారుఖ్‌లు. అది కూడా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు. అలాగే రీసెంట్గా పాకిస్తాన్ నటులపై నిషేధం విధించడం గురించి మరో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తెగ ఆవేశపడిపోయాడు. కళలు…కాకరకాయ అంటూ అద్భుతంగా ఆవేధనను నటించాడు. కానీ ఉగ్రవాదులు మన సైనికులపైన దాడి చేసిన విషయం గురించి మాట్లాడడానికి మాత్రం వీళ్ళకు మాటలు రావు. కనీసం సోషల్ మీడియాలో స్పందించే టైం కూడా వీళ్ళకు ఉండదు. బాలీవుడ్లో నటిస్తున్న పాకిస్తాన్ నటులు కూడా ఉగ్రవాద దాడులను ఖండించారు. కానీ మన ఖాన్స్‌కి మాత్రం స్పందించే తీరికలేకపోయింది.
ఇక భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మెస్సేజ్‌లు ఇస్తానని బయల్దేరే అమీర్ ఖాన్ ఈ రోజు చాలా చీప్‌గా బిహేవ్ చేశాడు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల గురించి ఇదే అమీర్ ఖాన్ బోలెడన్ని సినిమాల్లో స్పీచ్‌లు దంచాడు. బయట కూడా పబ్లిక్ రొమాన్స్ గురించి చాలా మాటలు చెప్పి ఉన్నాడు. కానీ ఈ రోజు మాత్రం బహిరంగంగా, అందరూ చూస్తూ ఉండగానే తన భార్యను లిప్ టు లిప్ కిస్ చేశాడు. ఇలాంటి వాటిని సమర్ధించే వాళ్ళు కూడా మన దగ్గర బోలెడుమంది ఉన్నారు కానీ ఎంతమంది సమర్ధించినప్పటికీ ఇది ముమ్మాటికీ తప్పే. సినిమాలలో కూడా మొదట్లో కొంచెం కొంచెం స్కిన్ షోతోనే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బికినీలన్నారు. ఇక ఇప్పటి పరిస్థితుల గురించి చెప్పేదేముంది? ఇప్పుడిక మన తెరవేల్పులందరూ ఇలా బహిరంగ ప్రదేశాల్లో రెచ్చిపోతే మాత్రం భవిష్యత్ భయానకంగా తయారవడం ఖాయం. సినిమా హీరోలు ఏం చేసినా…..గుడ్డిగా వాళ్ళను అభిమానిస్తూ…మూర్ఖంగా వాళ్ళను అనుకరించే, అనుసరించే జనాలకు మన దగ్గర కొదవలేదు. ఇలాంటి బహిరంగ రొమాన్స్ చూశాక టీనేజర్స్, యువతరం ఎలా రియాక్ట్ అవుతారో తెలియాలంటే కాలేజీల్లో జరిగే పార్టీలకు, యూనివర్సిటీల్లో జరిగే పార్టీలకు అటెండ్ అవ్వాలి. అప్పుడు తెలుస్తుంది. పరిస్థితులు ఎంత భయానకంగా తయారవుతున్నాయి? తయారయి ఉన్నాయి అన్న విషయం.
రేప్పొద్దున్న ఇదే అమీర్ ఖాన్ మీడియా ముందుకు వచ్చి, చాలా అమాయకంగా అండ్ ఆవేధనను వ్యక్తం చేస్తూ నా భార్య పట్ల నాకు ఉన్న ప్రేమను వ్యక్త పరచటం కూడా తప్పేనా? అని ప్రశ్నిస్తారనడంలో సందేహం లేదు. భార్యను ప్రేమించడంలో తప్పు లేదు. ఆ ప్రేమను వ్యక్తపరచడంలోనూ తప్పు లేదు. కానీ ఎక్కడ వ్యక్తపరచాలి? ఎలా వ్యక్తపరచాలి? అన్న కనీస జ్ఙానం లేకపోతే ఎలా? మళ్ళీ ఈయనగారికి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని బిరుదొకటి.