జాతీయ మీడియాలో ఆర్నాబ్ గోస్వామికో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రిపబ్లిక్ టీవీ అనే ప్రత్యేకమైన చానల్ పెట్టుకున్న తర్వాత ఆయన ఇమేజ్.. పూర్తిగా.. కాషాయమయైపోయింది. పూర్తిగా బీజేపీ ఎజెండాను అమలు చేస్తూ ఉంటారు. బీజేపీ వ్యతిరేకంగా.. ఏ పార్టీ అయినా నోరెత్తిందంటే.. ఆ పార్టీ ఉన్న రాష్ట్రంలో ఓ ఓపీనియన్ పోల్ ప్రకటించేస్తారు. అందులో బీజేపీకి వ్యతిరేకంగా గళమెత్తిన పార్టీ చాలా వెనుకబడిపోయిందని చెబుతూ ఉంటారు. ఏపీ విషయంలో ఇలాంటి వ్యూహం.. గత ఆరు నెలలుగా అమలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ రాజకీయాలపై ఎప్పుడు దృష్టిపెట్టినా.. ఓ సర్వే బయటకు వచ్చేస్తుంది. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార సమయంలో అలానే వచ్చింది. రెండు నెలల కిందట.. అలాగే.. వచ్చింది.. మొన్న చంద్రబాబు ఢిల్లీలో ఉన్న సమయంలోనూ అలాగే ఓ సర్వేను విడుదల చేశారు.
నిజానికి ఏపీలో, తెలంగాణలో ఎన్ని జిల్లాల్లున్నాయో.. ఆర్నాబ్ కు తెలుసో లేదో కానీ.. చిత్ర విచిత్రమైన ఫిగర్స్‌తో ఫలితాలు ప్రకటిస్తూ ఉంటారు. బీజేపీపై అంతు లేని ప్రేమ చూపిస్తూ ఉంటారు. రెండు రోజుల కిందట ప్రకటించిన సర్వేలో…కేవలం పార్లమెంట్ సీట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. అందులో కేసీఆర్ నేతృత్వంలోని… టీఆర్ఎస్ 7 సీట్లు … 30.40% ఓట్లు వస్తాయని తేల్చారు. ఇది కొంచెం రీజనబుల్ అనున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి 8 సీట్లు ..32.2% ఓట్లు వస్తాయని తేల్చారు. మరి రెండు ప్రధాన పక్షాలయి.. ఈ రెండింటికి.. 30లకి అటూ ఇటుగా ఓట్లు వస్తే..మిగతా నలభై శాతం ఎవరికి వెళ్తాయి..? ఈ విషయంలో…మరో డౌట్ ఎందుకు..?. బీజేపీకే.. ఏకంగా తెలంగాణలో పందొమ్మిది శాతం ఓట్లు వస్తాయట. అంత ఓటు బ్యాంక్ బీజేపీకి తెలంగాణలో ఉందా..?. అంతే ఉంటే.. ఓ పెద్ద ఫోర్స్ కాకుండా పోతుందా..?
ఇక ఏపీలోనూ అదే విచిత్రం చూపిస్తున్నారు. వైసీపీకి ఇరవై పార్లమెంట్ సీట్లు వస్తాయట.. టీడీపీకి ఐదు సీట్లు వస్తాయట. ఓట్ల శాతం… రెండు పార్టీలకు పది శాతం తేడా ఉంది. కానీ.. బీజేపీకి పదకొండు, కాంగ్రెస్‌కు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయట. బీజేపీకి ఏపీలో పదకొండు శాతం ఓట్లు వస్తాయంటే.. నమ్మేవాళ్లెవరైనా ఉంటారా..? కాంగ్రెస్ పార్టీ 9 శాతం ఓట్లు చీల్చుకుంటే.. వైసీపీకి 40 శాతం ఓట్లు వస్తాయా..?. ఇవన్నీ లాజిక్ లేని ప్రశ్నలు. వాళ్లు సర్వే అన్నారు. ప్రసారం చేశారు. కానీ.. ఈ సర్వేలు.. ఈ ఓటింగ్ షేర్స్ చూస్తే.. బీజేపీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది.. అని మిత్రుల్ని వెదికి పెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నారన్న ఫీలింగ్ మాత్రం అందరికీ కలగం సహజమే.