హైదరాబాద్: రాజ్‌కపూర్ వంశ వారసుడు రణ్‌బీర్ కపూర్ ఒక్కో చిత్రానికి రు.38 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు తాజాగా వెలుగులోకొచ్చిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రణ్‌బీర్ ఆర్థిక వ్యవహారాలు చూసే ‘క్వాన్’ అనే ఏజెన్సీపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసినపుడు ఈ విషయం వెలుగులోకొచ్చింది. రణ్‌బీర్ ఈ మొత్తాన్ని తన తాజా చిత్రం ‘తమాషా’కు తీసుకున్నట్లు బయటపడింది. మరోవైపు, ఇంతా చేసి ఆ ‘తమాషా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మాత్రం నిలిచింది. వాస్తవానికి రణ్‌బీర్‌కు కొంతకాలంగా మంచి హిట్ లేదు. ‘యే జవానీ హై దివానీ’ తర్వాత అతని చిత్రమేదీ పెద్దగా ఆడలేదు. ఈ ఏడాది చేసిన ‘రాయ్’, ‘బాంబే వెల్వెట్’ చిత్రాలు రెండూ ఫ్లాప్లయ్యాయి.
బాలీవుడ్లో ఇంతకుముందు ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రానికి హృతిక్ రోషన్ రు.50 కోట్లు తీసుకున్న విషయం సంచలనం సృష్టించింది. అగ్రనటులు షారుక్, సల్మాన్, ఆమిర్ ఖాన్లు కమిషన్ మరియు లాభాలలో వాటా విధానాలలో తమ పారితోషికాన్ని తీసుకుంటారు. గతంలో రణ్‌బీర్ కూడా ఈ విధానంలోనే పారితోషికం తీసుకునేవాడు.