కేటీఆర్ ను విమర్శించే క్రమంలో అక్కినేని ఫ్యామిలీని అవమానించేలా కామెంట్స్ చేసి ఇరుక్కుపోయిన కొండా సురేఖపై అధిష్టానం ఆగ్రహంగా ఉందా?కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయా?
ప్రస్తుతం ఈ అంశంపై పొలిటికల్ సర్కిల్లో తెగ చర్చ జరుగుతోంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీ మొత్తం ఏకతాటి మీదకు వచ్చి ఖండించింది. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలంటూ ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు. అయినా ఆమె మళ్లీ అదే తరహా కామెంట్స్ చేయడంతో సినీ ఇండస్ట్రీ కుతకుత ఉడుకుతుంది. ఈ విషయంపై అక్కినేని అమల కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీతో అమలకు మంచి సాన్నిహిత్యం ఉంది. దాంతో ఈ విషయం ప్రియాంక వద్దకు చేరిందని…కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రియాంక విచారం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో ఇలాంటి విషయాల్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంటుంది అని సంకేతాలు ఇచ్చేందుకు..కొండా సురేఖ మంత్రి పదవిపై వేటు వేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.ఐతే, ఆమెను మంత్రి పదవి నుంచి తప్పిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని అందుకే..ఆమెను రాజీనామా చేసేలా ఒప్పించాలని టిపిసిసినీ హైకమాండ్ పెద్దలు ఆదేశించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.