మంచు మనోజ్ హీరోగా ఫ్యామిలీ సినిమాలను తీస్తూ వస్తున్న దర్శకుడు దశరథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శౌర్య. రెజినా హీరోయిన్ గా నటించిన సినిమాలో మనోజ్ తన పాత సినిమాల కన్నా ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. ఎప్పుడు అల్లరి చిల్లరగా కనిపించే మనోజ్ ఈసారి కూల్ అండ్ కామ్ బోయ్ గా కనిపించి అలరించాలనుకున్నాడు. కాని అదే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.
మార్చ్ 4న రిలీజ్ అయిన శౌర్య సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో సోసోగానే నడుస్తుంది. కొన్నిచోట్ల సినిమా ఫ్లాప్ గానే లెక్కేశారు. ఇక ఓవర్సీస్ లో అయితే సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మిగిలింది. ప్రస్తుతం తెలుగు సినిమాలన్ని ఓవర్సీస్ మార్కెట్ మీద ఆధారపడుతుంటే మనోజ్ శౌర్య మాత్రం అక్కడ బాగా దెబ్బతిన్నది. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చేసరికి కాలిఫోర్నియాలో ఓ థియేటర్ లో సినిమా మొదటిరోజే కేవలం ఒక్క టికెట్ మాత్రమే సేల్ అవడంతో సినిమాను ఆపేశారు.
అయితే మనోజ్ కు ఓవర్సీస్ లో తగిలిన షాక్ చూసి తెలుగు దర్శకనిర్మాతల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఓవర్సీస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని కూడా సినిమాలు తీయాలని.. ఎలాంటి సినిమాలైనా వారు ఆదరిస్తారనే నమ్మకం పోయింది. సో మనోజ్ మరి ఓవర్సీస్ లో జరిగిన ఈ అవమానాన్ని ఎలా డైజెస్ట్ చేసుకుని రివెంజ్ తీర్చుకుంటాడో చూడాలి. ఇక తెలుగు సినిమా దర్శక నిర్మాతల్లో కూడా శౌర్య సినిమా ఓ హెచ్చరికలా ఉపయోగపడ్డదని చెప్పొచ్చు.