సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించాలని హీరోయిన్స్ అంతా అవకాశం కోసం ఎదురుచూస్తుంటే వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకుందట ఆషికి-2 హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఆషికి-2 సినిమాతో స్టార్ హీరోయిన్ అయిన అమ్మడు అభినయం ప్రాధన్యమున్న సినిమాలను చేస్తూ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాధించింది. మహేష్ బ్రహ్మోత్సవం తర్వాత చేస్తున్న ఏ.ఆర్.మురుగదాస్ సినిమాకు కథానాయిక ఎంపిక ఇంకా జరుగలేదు.
మహేష్ తో చేయబోయే ఆ సినిమాలో నటించేందుకు శ్రద్ధా కపూర్ ని అడుగగా ఏకంగా 3.50 కోట్లు ఇస్తేనే అని నిర్మాతలకు షాక్ ఇచ్చిందట. తెలుగు సినిమా స్థాయి ఎంత పెరిగినా హీరోల పారితోషికం కోట్లు దాటుతున్నా కాని హీరోయిన్స్ కి మాత్రం 1 నుండి 2 కోట్ల మధ్యలోనే పారితోషికం ఉంటుంది.
శ్రద్ధ చెప్పిన ఫిగర్ విని షాక్ అయిన నిర్మాతలు ఏం మాట్లాడాలో తెలియక గమ్మున వచ్చేశారట. ప్రిన్స్ మహేష్ తో ఇప్పటికే బాలీవుడ్ భామలు ప్రీతి జింటా, సోనాలి బింద్రే, బిపాసా బసులు నటించారు. ఇప్పుడు వారి దారిలోనే శ్రద్ధ లక్కీ చాన్స్ కొట్టేసింది అనుకుంటే భారీ పారితోషికం అడిగి నిర్మాతలకు చుక్కలు చూపించిందట. ప్రస్తుతం ఊటీలో బ్రహ్మోత్సవం షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో మురుగదాస్ సినిమా స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.