ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషన్ ను … పిటిషనర్ శ్రవణ్‌కుమార్ ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్ విచారణ అర్హతపై.. ధర్మాసనం … పిటిషనర్‌కు అనేక ప్రశ్నలు సంధించారు. కనీస ఆధారాలు లేకుండా.. పిటిషన్ వేయడం ఏమిటని ప్రశ్నించింది. ధర్మాసనానికి ఈ కేసుకు సంబంధించిన కోర్టుకు సరైన ఆధారాలు చూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. రాజకీయ అవసరాల కోసం వేసిన పిటిషన్లా ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాలు బయట చూసుకోవాలి కానీ… కోర్టు సమయాన్ని వృధా చేయడమేమిటని మండి పడింది. దీంతో.. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటానని.. శ్రవణ్ కుమార్ కోర్టుకు తెలిపారు. పూర్తి ఆధారాలతో కోర్టుకు రావాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ రాష్ట్ర ఐటి శాఖా మంత్రి నారా లోకేష్, ఏపిఎన్నార్టీకిచెందిన వేమూరి రవికుమార్ తప్పుడు ఎంవోయూలతో డొల్ల కంపెనీలను చూపించి 25 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని శ్రవణ్ కుమార్ పిల్లో ఆరోపించారు. శ్రవణ్ కుమార్ మాజీ జూనియర్ సివిల్ జడ్జి. ప్రస్తుతం న్యాయవాదిగా ఉన్నారు. జూనియర్ సివిల్ జడ్జిగా పని చేసిన వ్యక్తి… పిల్ వేయడంతో.. అందరి దృష్టి పడింది. అయితే.. న్యాయమూర్తిగా కూడా పని చేసిన వ్యక్తి.. రాజకీయ కక్షతోనే… ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తారని ఎవరూ అనుకోరు. దాంతో.. ఎవో కొన్ని ఆధారాలైనా సమర్పించి ఉంటారని అనుకున్నారు. కానీ శ్రవణ్ కుమార్ తన పిటిషన్లో.. సాక్షి సహా…ఇతర పత్రికల్లో వచ్చిన కథనాలు.. పవన్ కల్యాణ్, జగన్ లాంటి వాళ్లు చేసిన ఆరోపణలు.. ప్రభుత్వం వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలతోనే పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు.