ఈ సంక్రాంతికి రెండు భారీ సినిమా బాక్సాఫీసు దండయాత్రకు వస్తున్నాయి. చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ రెండూ ప్రతిష్టాత్మక చిత్రాలే. చిరు 150వ సినిమా అయితే, బాలయ్యకు ఇది వందో చిత్రం. దీంతో ఏ సినిమా బాక్సాఫీసు దగ్గర సత్తా చాటుతుందా? అన్న హాట్ టాపిక్ నడుస్తోంది. కాగా, ఈ చిత్రాలలో నటిస్తున్న హీరోయిన్స్ కు కూడా ఈ సినిమాలు కీలకం కానున్నాయి. ‘ఖైదీ నంబర్ 150’ లో కాజల్ హీరోయిన్. శాతకర్ణిలో శ్రియా. ఈ ఇద్దరి పరిస్థితీ ఒక మాదిరిగానే వుంది. ఈ ఇద్డరు ఒకప్పుడు టాప్ హీరోయిన్సే. శ్రియా..చిరంజీవి బాలకృష్ణ, రజనీకాంత్ , వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. ఇలా దాదాపు అగ్రహీరోలందరితోనూ జతకట్టింది. అయితే కొంత కాలంగా ఆమె జోరు తగ్గిపోయింది. ఆప్షనల్ హీరోయిన్ గా మారిపోయింది. కాజల్ పరిస్థితి కూడా ఇదే. ఆమె కూడా టాప్ కధానాయికులందరితోనూ జతకట్టింది. అయితే ఇప్పుడామె జోరు తగ్గుముఖం పట్టింది. అవకాశాలు రావడం లేదు. వచ్చినా అది కాస్త ఫ్లాఫ్ అయి కూర్చుటుంది.
ఇక ఈరెండు సినిమాలు కూడా వీరిద్దరికి సెకండ్ ఛాయిస్ గా వచ్చినవే. శాతకర్ణి కోసం మొదట నయనతారను సప్రదించారు. ఆమె బాగా బిజీ. మరో ఆప్షన్ లేక శ్రియాను ఎంపిక చేశారు. ఖైదీ విషయానికి వస్తే ఫస్ట్ ఛాయిస్ అనుష్క. అయితే స్వీటీ కూడా బిజీనే. బాహుబలి , బాగ్ మతి, సింగం3.. ఇలా చేతినిండా సినిమాలు వుండటంతో డేట్స్ ఇవ్వడం కుదరలేదు. దీంతో సెకెండ్ ఛాయిస్ గా కాజల్ ను ఎంపిక చేసుకున్నారు. వీరిద్దరికీ ఈ సినిమాలు కీలకం.
అయితే పెర్ర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే శ్రియాకి ఈ సినిమా కలసిరావొచ్చు. శాతకర్ణి భార్య వశిష్టదేవి మహారాణి పాత్ర పోషిస్తోంది శ్రియా. దర్శకుడు క్రిష్ ఈ పాత్రను చాలా ఎమోషనల్ గా మలచాడట. కనుక నటనకు ఆస్కారం ఉటుందని చెప్పొచ్చు. కాజల్ విషయానికి వస్తే.. కమర్షియల్ పాత్రే. గ్లామర్, పాటల్లో ట్యాలెంట్ చూపించాల్సిందే. మొత్తంమ్మీద ఈ రెండు సినిమాలు అటు కాజల్ ఇటు శ్రియాకు కీలకం. ఈ సినిమాలతో ఎదో ఒకటి డిసైడైపోతుంది. మరీ డిసైడింగ్ పరీక్షలో ఎలాంటి ఫలితాల్ని రాబట్టుకుంటారో ఈ సినీయర్ నటీమణులు.