బాహుబలి-2 లో భళ్లాలదేవ భార్యగా శ్రీయ నటిస్తుందని ఒకటే హడావిడి చేస్తున్నారు మీడియా వారు. రానా సిఫార్సుతో బాహుబలి-2లోకి శ్రీయ కూడా అడుగుపెట్టిందని టాక్. అంతేనా రానా, శ్రీయ భార్యగా నటిస్తుంది అని ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు రాజమౌళికి లేని రకరకాల ఐడియాలు వచ్చేస్తున్నాయి ఈ గాసిప్ రాయుళ్లకు. ఇక తనపై వచ్చిన ఈ కన్ ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చేసింది అమ్మడు.
తాను బాహుబలి-2లో నటించట్లేదని.. అసలు తనను ఆ చిత్రానికి సంబధించిన వారు ఎవరు కలవలేదని చెప్పింది. అయితే ఇదే విషయం మీద రాజమౌళి కూడా బాహుబలిలో నటించే ఆర్టిస్ట్ ల మీద వస్తున్న ఈ వార్తలన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టేలా త్వరలో తానే ఓ క్లియర్ ఎనౌన్స్ మెంట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సన్నిహితులతో రూమర్ ఎలాంటివి నమ్మొద్దని చెప్పాడట. శ్రీయ మాత్రం బాహుబలిలో నేను లేను బాబోయ్ అంటూ నెత్తి నోరు వేసుకుని మొత్తుకుంటుంది. మరి ఇప్పటికైనా ఈ గాసిప్ ఆగుతుందో లేదో చూడాలి.