సౌత్ సినిమాల్లో శ్రీయ సరన్ ది సెపరేట్ క్రేజ్ అమ్మడు మెగాస్టార్ నుండి సూపర్ స్టార్ వరకు అందరితో సినిమాలు చేసింది. అయితే ప్రస్తుతం శ్రీయకు బాహుబలి సమస్య వచ్చి పడ్డది. శ్రీయకి బాహుబలి సినిమా సమస్య ఏంటని మీరనుకోవచ్చు.. ప్రస్తుతం క్రేజ్ మీదున్న రాజమౌలి బాహుబలి సెకండ్ పార్ట్ డిశెంబర్లో షూటింగ్ స్టార్ అవ్వనుంది. ఈ సినిమాలో భళ్లాలదేవ భార్యగా హాట్ గాళ్ శ్రీయ కనిపించనున్నదని మీడియా కోడై కూస్తుంది. అయితే చివరకు శ్రీయ స్పందించి తను బాహుబలి-2లో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది.
మీడియా వారికి ఇలాంటి వార్తలు ఎలా దొరుకుతాయో కాని అనవసరంగా సంబంధం లేని వారిని వార్తల్లోకి తెస్తారని కాస్త ఫైర్ అయ్యింది అమ్మడు. రీసెంట్ గా గోపాలా గోపాలా సినిమాతో అలరించిన శ్రీయ కెరియర్ దాదాపు ఎండింగ్ కి వచ్చినట్టే.. రాజమౌలి ఛత్రపతి సినిమాలో ప్రభాస్ కి జోడీగా నటించింది ఈ బ్యూటీ.. ఆ కారణం చేతనే బాహుబలి-2లో రానాకు భార్యగా నటించే అవకాశం ఉందని రూమర్ లేపారు.
చివరకు అమ్మడు వచ్చి చెప్తేనే గాని అది నిజం కాదన్న విషయం తెలిసింది. మొత్తానికి బాహుబలి మేనియాలో బలైంది శ్రీయ.. అయితే ఎలాగూ ముద్ర పడ్డది కాబట్టి ఏదో ఒక క్యారక్టర్లో శ్రీయని ఉంచేయ్ గురు అని రాజమౌలికి సలహాలిస్తున్నారు ప్రేక్షకులు. అయినా సినిమాలో ఎవరిని పెట్టాలో ఎలా పెట్టాలో మన జక్కన్నకు తెలియదా ఏం..!