గౌతమి పుత్ర శాతకర్ణి తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ కూడా మొదలైపోతోంది. సోమవారం నుంచి హైదరాబాద్లో షూటింగ్ మొదలెడతారు. అయితే ఇప్పటి వరకూ కథానాయిక విషయంలో ఓ క్లారిటీకి రాలేకపోతోంది చిత్రబృందం. నయనతార, అనుష్కపేర్లు పరిశీలనకు వచ్చినా… వాళ్ల డేట్లు దొరకడం లేదు. జులైలో హీరోయిన్ డేట్లు కావాలి. అయితే నయనకు జులై షెడ్యూల్ అంతా బిజీ. అందుకే తాను డ్రాప్ అయిపోయింది. అనుష్క పరిస్థితీ అంతే. అందుకే చిత్రబృందం ఇప్పుడు శ్రియవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాణి పాత్రలో శ్రియ పర్ఫెక్ట్గా సెట్టయిపోతుందని చిత్రబృందం నమ్మకం.
పైగా శ్రియ కాల్షీట్లు అన్నివేళలా అందుబాటులో ఉంటాయి. జూన్ నెలాఖరు వరకూ ఆగి, నయన కాల్ఫీట్లు అప్పటికీ సర్దుబాటు కావు అనుకొంటే.. అప్పుడు శ్రియని సెలక్ట్ చేయొచ్చని బాలయ్య అండ్ కో భావిస్తున్నార్ట. జూన్ మొదటి వారంలో బాలయ్య అమెరికా ట్రిప్ వేస్తున్నాడు. అక్కడి నుంచి తిరిగొచ్చేలోగా కథానాయికని డిసైడ్ చేయాలని చిత్రబృందం టార్గెట్ ఫిక్స్ చేసుకొంది. అన్నీ కుదిరితే… గౌతమి పుత్రలో శ్రియ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.