మంచు లక్ష్మి మొదలు పెట్టిన మేముసైతం కార్యక్రమానికి స్టార్స్ అంతా తమ సహకారాన్ని అందిస్తున్నారు. రకుల్ తో కూకట్ పల్లిలో కూరగాయలు అమ్మించిన మంచు లక్ష్మి.. ఖమ్మంలో అఖిల్ ను ఆటోడ్రైవర్ గా చేసింది. రానాను కూలీగా రెజినాను సారీ సేల్స్ గాళ్ గా మార్చిన లక్ష్మి ఇప్పుడు శ్రీయాను సూపర్ మార్కెట్ లో సేల్స్ గాళ్ గా మార్చింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన మొత్తాన్ని ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అందచేస్తుంది మంచు లక్ష్మి. కొద్దిరోజుల నుండి మొదలు పెట్టిన ఈ కార్యక్రమం జెమిని టివిలో ప్రసారం చేసేందుకు రెడీ చేస్తున్నారు.
లక్ష్మి కోరిక మేరకు శ్రీయ మాధాపూర్ లోని సంపూర్ణ సూపర్ మార్కెట్ లో సేల్స్ గాళ్ గా, క్యాషియర్ గా బిల్ కౌంటర్ లో కాసేపు సందడి చేసింది. సెలబ్రిటీస్ అమ్ముతున్న మెటీరియల్స్ ను కొనడంలో ఉన్న మజాను ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు, వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు.. ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మంచి ఫీడ్ బ్యాక్ ను ఇస్తున్నారు. మరి సడెన్ గా ఏదో ఓ రోజు మీ ఏరియాలో కూడా సెలబ్రిటీస్ వచ్చి సందడి చేసే అవకాశం లేకపోలేదు అందుకు మీరు సిద్ధంగా ఉండండి మరి.
Me at work ! pic.twitter.com/SJnZAgqXXc
— Shriya Saran (@shriya1109) March 19, 2016