కమర్షియల్ కథానాయికలంతా దాదాపుగా లేడీ ఓరియెంటెడ్ వైపు అడుగులు వేసినవాళ్లే. వాళ్లలో చాలామంది పోలీస్ అవతారాల్లోనూ కనిపించారు. ఎప్పుడైతే విజయశాంతి ‘కర్తవ్యం’ సూపర్ డూపర్ హిట్టయిపోయిందో.. ఆ రోజుల్లో లేడీ పోలీసులు ఓ ట్రెండ్. విజయశాంతి, వాణీ విశ్వనాథ్, జయప్రద… ఇలా దాదాపుగా ఓ తరం కథానాయికలంతా ఖాకీ కట్టి. లాఠీ పట్టి ఫైటింగులు చేసినవాళ్లే. అయితే ఈ తరంలో ఆ జోరు బాగా తగ్గింది. దెయ్యం కథల పుణ్యమా అని పోలీస్ డ్రస్సుల్లో కథానాయికలు కనిపించడం తక్కువైపోయింది. మొన్నామధ్య సుప్రీమ్లో రాశీఖన్నా, నక్షత్రంలో ప్రగ్యా జైస్వాల్ లేడీ పోలీస్ ఆఫీసర్లుగా కనిపించారు. ఇప్పుడు శ్రియ కూడా పోలీస్ గా మారబోతోంది. ‘వీరభోగవసంతరాయులు’ సినిమాలో. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రమిది. ఇందులో శ్రియ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతోంది. ఇదికాక ఓ హిందీ చిత్రంలోనూ నటిస్తోంది ఢిల్లీ డాల్. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘గాయత్రి’ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ”నాకు తగిన పాత్రలు నన్ను వెదుక్కుంటూ వస్తున్నాయి. ఈ వయసులోనూ కెరీర్ని ఎంజాయ్ చేస్తున్నా” అని చెప్పుకొచ్చింది శ్రియ.