ఇప్పటి హీరోయిన్లు మహా కాస్ట్లీ. సమంత, తమన్నా కోటి తగ్గరు. నిన్న మొన్న వచ్చిన రకుల్ ప్రీత్ సింగే రూ.75 లక్షలు ఈజీగా పట్టుకెళ్లిపోతోంది. నయనతార, అనుష్కలంటే కోటికి కూడా అందరు. వాళ్లవన్నీ రెండు కోట్ల సినిమాలే. ఓ కథానాయిక వరుసగా రెండు హిట్లు కొడితే చాలు, కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం ఖాయం. స్టార్ హీరోతో సినిమాఅనగానే, హీరోయిన్ కూడా అదే రేంజులో ఉండాల్సిందే. కాబట్టి పెద్ద హీరోల సినిమాల కోసం కోటి పెట్టి హీరోయిన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణికి కూడా స్టార్ హీరోయిన్ నే ఎంపిక చేసుకోవాలనిచూశారు. నయనతార, అనుష్క పేర్లు పరిశీలించారు. వాళ్లు కుదిరితే కనీసం కోటిన్నర అయినా ముట్టజెప్పాల్సివచ్చేది. ఇప్పుడు శ్రియతో సర్దుకుపోవాల్సివచ్చింది. అదీ ఒకందుకు నయమే అయ్యింది.ఎందుకంటే నయన, అనుష్క కంటే శ్రియ మహా చీప్.
ఈ సినిమా కోసం శ్రీయ అందుకోబోతున్న పారితోషికం అక్షరాలా రూ.35 లక్షలని తేలింది. ఒకప్పుడు ఇదే శ్రియ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు 60, 70 లకారాలు అందుకొంది. ఇప్పుడు సగానికి సగం తగ్గించేసింది.పైగా 40 రోజులకు పైగానే కాల్షీట్లు కేటాయించిందట. ఈనెలాఖరు నుంచి శ్రియ సెట్లోకి రాబోతోందని టాక్.