ఈరోజు శ్రుతిహాసన్ బర్త్ డే. ఈ పుట్టిన రోజు మాత్రం శ్రుతి ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే… ఈ రోజే.. `సలార్` సినిమాలో శ్రుతి హాసన్ ఉందన్న విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించి, శ్రుతికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేసింది. `సలార్` సినిమాలో శ్రుతి నటిస్తుందన్న వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. అయితే.. దానిపై క్లారిటీ లేదు. ఈరోజు చిత్రబృందం అధికారికంగా ధృవీకరించేసింది.
నిజానికి గత రెండేళ్లుగా శ్రుతి అస్సలు రేసులోనే లేదు. తనని తెలుగులో ఎవ్వరూ పట్టించుకోలేదు. తెలుగు సినిమాల్ని శ్రుతి కూడా లైట్ తీసుకుంది. మైఖెల్ తో ప్రేమలో పడ్డాక, సినిమాలపై దృష్టి బాగా తగ్గించేసింది. అయితే.. `వకీల్ సాబ్`తో శ్రుతికి మళ్లీ పిలుపొచ్చింది. రవితేజ – గోపీచంద్ మలినేనిలు.. తమ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేయాలన్న ఉద్దేశంతోనే.. శ్రుతికి `క్రాక్`లో చోటిచ్చారు. అనూహ్యంగా క్రాక్ సూపర్ హిట్టవ్వడం, అందులో శ్రుతి కూడా వాటా దక్కించుకోవడంతో.. `సలార్` దర్శక నిర్మాత దృష్టి.. శ్రుతిపై పడింది. అలా.. ప్రభాస్ తో జోడీ కట్టే ఛాన్స్ అందుకుంది. ఇది పాన్ ఇండియా సినిమా. పైగా భారీ ప్రాజెక్టు. కాబట్టి… ఏమాత్రం హిట్టయినా.. శ్రుతి సుడి తిరిగిపోవడం ఖాయం.