పవన్ కల్యాణ్ కమ్ బ్యాక్ సినిమా `వకీల్ సాబ్`. ఈ సంక్రాంతికి విడుదల కావల్సింది. ఇప్పుడు మార్చి లోనే వకీల్ సాబ్ చూడాలి. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. అయితే ముందు నుంచీ ఈ సినిమాలో శ్రుతి స్థానం డౌటే. హీరోయిన్గా శ్రుతి ఉంటుందా? అసలు ఆ పాత్ర.. ఉంటుందా? తీసేస్తారా? అనే అనుమానాలే. ఎట్టకేలకు ఈ సినిమాలో శ్రుతికి చోటు దక్కింది. అయితే… హీరోయిన్ గా కాదు. అతిథి పాత్రేనట. ఈ విషయాన్ని శ్రుతినే చెప్పింది.
“వకీల్ సాబ్లో నేనూ నటించా. నేను హీరోయిన్ అని చెప్పలేను. అతిథి పాత్ర అనుకోవాలి. కాసేపే ఉంటాను. కానీ నా పాత్రని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. పవన్ కల్యాణ్ తో నటించే అవకాశం ఎప్పుడు వచ్చినా వదులుకోను” అని చెబుతోంది శ్రుతి. ఈ సంక్రాంతికి విడుదలైన `క్రాక్` హిట్ టాక్ కొట్టేసింది. ఇందులో శ్రుతినే నాయిక. ఓ ఫైట్ లోనూ విజృంభించింది. “గోపీచంద్ మలినేని ఆ సన్నివేశం చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. అంతకు ముందే ఓ హాలీవుడ్ షో కోసం యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు శిక్షణ పొందాను. అది ఇప్పుడు ఉపయోగపడింది” అని చెప్పింది శ్రుతి.