బయోపిక్ అంటే అందరికీ ఆసక్తే. జీవితకాలంలో అలాంటి ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉంటుంది. కొందరికైతే.. తమ కథనే సినిమాగా తీస్తే బాగుంటుందన్న ఆశకూడా ఉంటుంది. శ్రుతిహాసన్‌కి కూడా అలాంటి కోరికలు ఉన్నట్టున్నాయి. అందుకే మాటల సందర్భంలో… మనసులోని కోరిక బయటకు వచ్చేసింది. ఇన్స్ట్రాలో అభిమానులతో కాసేపు చిట్ చాట్ చేసింది శ్రుతి. ఈసందర్భంగా `మీ కథ బయోపిక్‌గా తీస్తే.. ఏం పేరు పెడతారు` అని ఓ అభిమాని అడిగితే… “నా మీద బయోపిక్కా.. అంత సీన్ లేదు“ అంటూ రొటీన్ కబుర్లు చెప్పకుండా.. `జ్వాలాముఖి అనే టైటిల్ పెడతా“ అని టక్కున చెప్పేసింది. బహుశా… ఈ టైటిల్ కి సరిపడ కథ తన దగ్గరేమైనా రెడీగా ఉందేమో మరి..?
తనకు నటన వారసత్వంగా వచ్చిందని, ఆ కళ తనకు పుట్టుకతోనే ఉందని, అయితే.. దాన్ని కాపాడుకోవడానికి నేను అనుక్షణం కష్టపడుతుంటా“ అని చెప్పుకొచ్చింది శ్రుతి. నెగిటీవ్ పాత్రలంటే తనకు చాలా ఇష్టమని, అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నానని అంటోంది. శ్రుతి చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. ఒకటి క్రాక్. మరోటి వకీల్ సాబ్. జనవరి నుంచి వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొనబోతోంది శ్రుతి. ఈ రెండు సినిమాలపై తనకు చాలా ఆశలే ఉన్నాయి.