లారెన్స్ కథానాయకుడిగా స్టూడియో గ్రీన్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. ‘రైడ్’, ‘రాక్షసుడు’ చిత్రాలతో హిట్లు కొట్టిన రమేష్ వర్మ దర్శకుడు. ఈ చిత్రానికి ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లు కావాలి. ఓ కథానాయికగా నయనతార, మరో పాత్ర కోసం శ్రుతి హాసన్ పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి. లారెన్స్‌తో వీరిద్దరూ జోడీ కట్టడం ఇదే తొలిసారి. ఈనెల 14న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. హారర్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. లారెన్స్‌కి హారర్ కథలు బాగానే వర్కవుట్ అయ్యాయి. ‘కాంచన’ సిరీస్‌తో కనక వర్షం కురిసింది. లారెన్స్ మార్కెట్ పెరగడానికి హారర్ జోనర్ ఓ కారణమైంది. లారెన్స్‌కి చాలా కాలంగా హిట్లు లేవు. మళ్లీ ఈ జోనర్‌తో తనకు హిట్ పడుతుందేమో చూడాలి. కాకపోతే ఓ హారర్ చిత్రానికి ‘శ్రీరామరక్ష’ అనే ఫ్యామిలీ టైటిల్ పెట్టడం కొత్తగా అనిపిస్తోంది. హారర్ కథకూ, ఈ టైటిల్ కూ ఉన్న లింకేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.