ప్రస్తుతం వరుస సినిమా సక్సెస్ లతో ఫుల్ ఫాంలో ఉన్న శృతిహాసన్ ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో పాలు పంచుకుంటుంది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు హిట్ తో క్రేజీ హీరోయిన్ అయిన శృతి మలయాళ ‘ప్రేమమ్’ తెలుగు రీమేక్ ‘మజ్ఞు’లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. మూడు ప్రేమకథల సమాహారంతో నడిచే ‘ప్రేమమ్’ లో హీరో మొదటి లవర్ గా శృతి కనిపించనున్నదట. అయితే క్యారక్టర్ పరంగా ప్రేమమ్ లో ఆ పాత్రకు పెళ్లి కూడా అవుతుందట.
శృతి హాసన్ ని పెళ్లి చేసుకునే క్యారక్టర్లో మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ దర్శనమిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ట్రెండీగా ఉన్న ఈ యువ హీరో మజ్ఞు సినిమాలో చిన్న పాత్ర ఒప్పుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. శృతి హాసన్ భర్తగా సాయి ధరం తేజ్ అలరించనున్నాడట. శృతి హాసన్ తో పాటుగా మలయాళ ప్రేమమ్ అసలు హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్ కూడా తెలుగులో నటిస్తుంది.
నాగచైతన్య హీరోగా వస్తున్న ‘మజ్ఞు’లో కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ లు కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని టాక్. మరి ఇంతమంది కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించనుందో చూడాలి.