లోకనాయకుడు కమల్ హాసన్ తనయురాలిగా ఆయనలానే కేవలం నటన మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో తన ప్రతిభ చాటుకుంటుంది శృతి హాసన్. కథానాయికగా నిలదొక్కుకోవడానికి మాత్రమే కష్టపడ్డ శృతి హాసన్ ఆ తర్వాత సౌత్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించింది. హీరోయిన్ గా మారడానికి ముందే మ్యూజిక్ కంపోజింగ్ లో అనుభవం పెంచుకున్న శృతి ఒకటి రెండు సినిమాలకు సంగీత దర్శకురాలిగా కూడా పనిచేయడం జరిగింది.
ఇక ఇప్పుడు హీరోయిన్ గా ఫుల్ స్వింగ్ లో ఉన్న అమ్మడు తనలోని మరో టాలెంట్ ను బయట పెట్టే ఆలోచనలో ఉంది. అదేంటో అనుకుంటున్నారా అదే కాప్టెన్ ఆఫ్ ది షిప్.. అదేనండి దర్శకత్వం. తండ్రి నటుడు, నిర్మాత, దర్శకుడు కాబట్టి తాను కూడా దర్శకత్వం చేయాలని ఆశపడుతుంది శృతి హాసన్. ప్రస్తుతం చేతిలో నాలుగు సినిమాలతో బిజీగా ఉన్న శృతి హాసన్ వాటిని పూర్తి చేశాక దర్శకత్వం చేసే ఆలోచనలో ఉందట.
ఇప్పటికే దానికి సంబంధించిన కార్యచరణలు మొదలు పెట్టిందని తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ శ్రీమంతుడుతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో నటిస్తుంది. సో తండ్రికి తగ్గ తనయురాలిగా శృతి ఇలా అన్ని రంగాల్లో అడుగులేయడం ఆమె అభిమానులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది.