శ్రుతి హాసన్ జాక్ పాట్ కొట్టేసింది. వరుసగా చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో కథానాయికగా అవకాశాలు అందుకొంది. రెండు సినిమాలూ ఈ సంక్రాంతికే విడుదల అవుతున్నాయి. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలూ.. రెండూ ఇంచుమించు ఒకేసారి విడుదల అవ్వడం, రెండింటోనూ శ్రుతినే కథానాయిక కావడం… నిజంగా విశేషమే. ఈ రెండు సినిమాలపైనా శ్రుతి చాలా ఆశలు పెట్టుకొంది. తప్పకుండా ఈ రెండు సినిమాలూ హిట్టవుతాయని అంటోంది. వాల్తేరు వీరయ్యలో.. చిరుతో కలిసి స్టెప్పులేసింది శ్రుతి. ఇందులో ‘చిరంజీవి – శ్రీదేవి’ పాట సూపర్ హిట్టయ్యింది. ఈ పాటని పారిస్లో తీశారు. మైనస్ 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ పాటని తెరకెక్కించారు. ఈ పాట చూడ్డానికి బాగున్నా చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సివచ్చిందని అంటోంది శ్రుతి.అంత చలిలో.. చీర కట్టుకొని పాటకు డాన్స్ చేయడం సులభమైన విషయం కాదని, పాట బాగున్నా.. సెట్లో ఎంజాయ్ చేయలేకపోయాయని, మళ్లీ అలాంటి తప్పు జీవితంలో చేయనని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్.
“ఇలాంటి పాటల్ని చూడ్డానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కాకపోతే… తెరకెక్కించడం మాత్రం చాలా కష్టం. అంతటి క్లిష్టపరిస్థితుల్లో స్టెప్పులేయడం అవసరమా అనిపించింది? ఇంకెప్పుడూ ఇలాంటి వాతావరణంలో పనిచేయను..“ అంటోంది. చిరుతో చేసిన వాల్తేరు వీరయ్య, బాలయ్యతో చేసిన వీర సింహారెడ్డి రెండూ… సూపర్ హిట్ అవుతాయన్న ధీమా వ్యక్తం చేసింది. “ఇద్దరు పెద్ద హీరోలతో ఒకేసారి పనిచేయడం గొప్ప అనుభవం. ఈ సినిమాల కోసం చాలా కష్టపడ్డాం. తప్పకుండా మంచి ఫలితం వస్తుందన్న నమ్మకం ఉంద“న్నారు.