మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తీసిన బ్రూస్ లీ అపజయపాలవ్వడంతో తర్వాత తీసే సినిమాకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళ సినిమా ‘తని ఒరువన్’ రీమేక్ గా వస్తున్న ‘రక్షక్’ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వం చేస్తుండగా.. గీతా ఆర్ట్స్ పతాకంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. అయితే ముందునుండి ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఇంతవరకు ఓ స్పష్టత రాలేదు సరికదా కాసేపు ఆ హీరోయిన్ అని కొందరంటే కాదు కాసేపు ఈ హీరోయిన్ అని అనుకున్నారు.
తెలుస్తున్న సమాచారం ప్రకారం చరణ్ ‘రక్షక్’ సినిమాలో చివరకు అందరు శృతి హాసన్ కు మొగ్గుచూపారట. చరణ్, శృతిలు ఇదవరకు ఎవడు సినిమాలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు అయితే మరోసారి ఆ మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారన్నమాట. కిక్-2 ఫలితం చూసి కూడా సురేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చి మరోసారి తన మంచితనం చాటుకున్నాడు చెర్రి. అయితే బ్రూస్ లీలా ఈ సినిమా ఊహించని ఫలితాన్ని ఇవ్వకుండా సినిమా చాలా సేఫ్ జోన్ లో తెరకెక్కిస్తూ కచ్చితంగా హిట్ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఫుల్ క్రేజ్ మీదున్న శృతి హాసన్ ఈ సినిమాలో నటించడం సినిమాపై ఇంకా భారీతనాన్ని తెచ్చిపెట్టింది. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా ముహుర్తం పెట్టబోతున్నారు దర్శక నిర్మాతలు.