ఈ సంక్రాంతి శ్రుతిహాసన్దే. ఈ పండక్కి పోటా పోటీగా విడుదల కాబోతున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో తాను కథానాయికగా నటిస్తోంది. ఈ రెండింటిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక్కటి హిట్ అయినా.. శ్రుతి కెరీర్ టాప్ గేరులో దూసుకుపోవడం ఖాయం. రెండూ ఆడేస్తే… ఇక శ్రుతికి తిరుగులేదు. బాలయ్య, చిరంజీవి ఇద్దరూ డాన్సుల్లో టాప్. ఈ రెండు సినిమాల్లో మంచి మాస్ పాటలు పడ్డాయి. కాబట్టి… శ్రుతి రెచ్చిపోయి ఉంటుంది. ఈ రెండు సినిమాల్లో హీరోలతో రొమాన్సే కాదు.. కడుపుబ్బా నవ్వించేలా కామెడీ కూడా చేసిందట. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవితో ఓ ఫన్నీ ఫైట్ సీన్ ఉంది. ఈ ఫైట్… సరదా సరదాగా సాగిపోతోందని టాక్. ఈ ఫైట్ ని రామ్ లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేశారు. చిరు కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది? దానికి శ్రుతి తోడైంది. ఇక… నవ్వులే నవ్వులు. అంతే కాదు.. `వీర సింహారెడ్డి`లో శ్రుతితో వీర లెవిల్ లో కామెడీ చేయించార్ట. ఆ సన్నివేశాలన్నీ బాగా నవ్విస్తాయని తెలుస్తోంది. ”కమల్ హాసన్‌లో కామెడీ యాంగిల్ ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. శ్రుతి కూడా తక్కువ చేయలేదు. ఆయన్ని గుర్తు చేసేలా.. ఈ సినిమాలో కామెడీ చేసింది” అంటూ రచయిత బుర్రా సాయిమాధవ్ హింట్ ఇచ్చేశారు. సో… ఈ సంక్రాంతికి శ్రుతిలోని కామెడీ యాంగిల్ బయటకు రాబోతోందన్నమాట.