వైసీపీలో కొంత మంది కొత్త సోషల్ మీడియా కార్యకర్తలు జగన్ చెప్పిన గుడ్ బుక్ లో పేర్లు రాసుకుంటారని ఆశతో అతిగా ప్రవర్తించడం చేస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రికే బెదిరింపులు ఇస్తున్నారు. ఇలాంటివి రాజకీయ పోరాటం అని వారు అనుకుంటున్నారేమో కానీ కేసుల పాలై నిండా మునిగిపోతారు. తర్వత పట్టించుకునేవారు కూడా ఉండరు. గతంలో కొన్ని వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలకు ఇదే పరిస్థితి ఎదరైంది. అలాంటి వారిలో శ్యామ్ కలకడ , అజయ్ అమృత్ అనే వాళ్లు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.
జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కోసం చాలా మంది పని చేశారు. పదేళ్ల పాటు ఆయన కోసం కొన్ని లక్షల మంది పని చేస్తే ఆయన అధికారంలోకి వచ్చారు. శ్యామ్ కలకడ అనే వ్యక్తి వైసీపీ సోషల్ మీడియాలో చాలా ప్రభావవంతంగా ఉండేవారు. సొంత డబ్బుతో ఊరూరా ప్రచారం చేసేవారు. అలాంటి వారి కృషి ఫలించి జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ శ్యామ్ కలకడ వంటి వారి అనారోగ్యానికి గురైతే ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ప్రాణం ఉన్నప్పుడే కాదు.. ప్రాణం పోయిన తరవాత కూడా ఆ శ్యామ్ కలకడ వైసీపీ నేతలెవరికీ గుర్తు రాలేదు.
అజయ్ అమృత్ అనే వ్యక్తి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్జిల కేసు వచ్చే వరకూ వైసీపీ కాంపౌండ్ లోనే ఉన్నారు. జైలుకు కూడా వెళ్లారు. కానీ బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ రాలేదు. దీంతో ఎలాగోలా బయటకు వచ్చారు. జైలుకు పంపిన వారు పట్టించుకోకపోవడంతో సీన్ అర్థమైపోయింది. ఆయన టీడీపీలో చేరారు. అయితే ఆయపైన గంజాయి కేసు పెట్టించేశారు. అటు శ్యామ్ కలకడ చనిపోయినా.. అటు అజయ్ అమృత్ అనే వ్యక్తికి ధర్డ్ డిగ్రీ ఇచ్చినా గుర్తించాల్సింది ఏమింటంటే.. వీరు జగన్ ను సీఎంను చేయడానికి పని చేసి కుటుంబాలను ఇబ్బందుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు రెచ్చిపోతున్న సోషల్ మీడియా కార్యకర్తలు కూడా దీన్ని గుర్తించాల్సిందేమో ?