గుంటూరులో జగన్ ఎప్పుడు పర్యటించినా పక్కన విడదల రజనీ ఉంటున్నారు. కానీ ఆమె ఒక్క మాట మాట్లాడటం లేదు. గతంలో ప్రెస్మీట్లు పెట్టేవారు. ఈ మధ్య అదీ కూడా లేదు. శ్యామల మాట్లాడేదే ఎక్కువ అన్నట్లుగా ఉంది. అయితే మరో గుంటూరు మేడమ్ మేకతోటి సుచరిత జగన్ తో పాటు పర్యటనల్లో కూడా పాల్గొనడం లేదు ఓ వైపు జగన్తో పాటు టూర్లలో పాల్గొంటున్నా జనసేతో విడదల రజనీ చర్చలు అయిపోయాయని చెప్పుకుంటున్నారు. సుచరిత అయితే ఏ పార్టీతో టచ్ లోకి వెళ్లారో కూడా అర్థం కావడం లేదు కానీ ఆమె కూడా రెడీగా ఉన్నారంటున్నారు.
జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణిస్తే తాను మునిగిపోవడమే కాదు తమనూ ముంచుతారని అందరికీ ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అడ్డగోలు పనులతో ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమవుతూంటే.. పార్టీపై ఆశల్లేకుండా జగన్ రెడ్డి కుటుంబ వివాదాలను సైతం సిల్లీ కారణాలతో ప్రజల్లోకి చర్చకు పెడుతున్న విధానం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇలాంటి విషయాల్లో ప్రజల్లో ఎలాంటి పరిణామాలకు కారణం అవుతాయో కనీసం ఊహించలేకపోతున్నారని.. ఆ మాత్రం తెలివి తెలివిలేదా అనుకుంటున్నారు.
గుంటూరులో జగన్ రెడ్డికి నికంగా మిగిలేది నలుగురు చిల్లర పనులు చేసే రౌడీ బ్యాచ్ ను వెంటేసుకుని తిరిగే అప్పిరెడ్డి మాత్రమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మద్దాళి గిరి కూడా గుడ్ బై చెప్పారు. బతికుంటే బలుసాకు తినవచ్చు కానీ జగన్ తో ఉంటే అది కూడా ఉండదని ఆయన ఫిక్సయిపోయారు. చాలా మంది నేతలు జనసేనతో సంప్రదిపుల్లో ఉన్నారు. సమయం చూసి ఒక్కొక్కరు గట్టిగా షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.