ప్రకాశం జిల్లాలో తెలుగు దేశం పార్టీలో భారీ గ్రానైట్ వికెట్ పడబతోంది. ఐదేళ్లు మంత్రిగా చేసిన శిద్దా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వైసీపీలో చేరికపై ఇప్పటికపై జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శిద్దా రాఘవరావుతో చర్చలు జరిపారు. శిద్దా రాఘవరావుతో పాటూ ఆయన కుమారుడు శిద్దా సుధీర్ కూడా వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శిద్దా రాఘవరావు గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో శిద్దా క్వారీల్లో అక్రమాలు జరిగాయంటూ రూ. 300 కోట్ల భారీ జరిమానా విధించారు.
దీంతో పాటూ శిద్దా క్వారీ నుండి గ్రానైట్ రాయి ఎగుమతులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలోఅధికార పార్టీ నాయకులతో చర్చలు జరిపిన శిద్దా రాఘవరావు వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలను.. ఆకర్షించాలనే లక్ష్యంతోనే గ్రానైట్ క్వారీలను టార్గెట్ చేసినట్లుగా కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఎలాగో తట్టుకున్న శిద్దా..ఇక పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
కొన్ని రోజులకిందట.. ఆయన సమీప బంధువుల్ని వైసీపీలో చేర్చి తాను సైలెంట్ గా ఉన్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి వ్యాపారానికి ఆటంకాలు వస్తూండటంతో.. పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన అనుచర వర్గం చెబుతోంది. ఇప్పటికే వైసీపీలో ప్రకాశం జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతుల చేరారు. ఎమ్మెల్యే కరణం బలరాం.. పోతులసునీత..పాలేటి రామారావు.. కదిరి బాబూరావు లాంటి వాళ్లు చేరారు. మరికొందరు ప్రముఖులపై పార్టీ మారుతారనే ప్రచారం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంది.