కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తమ రాష్ట్రంలో సీబీఐ రాకుండా జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. మైసూర్లో తన సతీమణికి అక్రమంగా భూముల కేటాయింపు చేసుకున్నారన్న అంశంపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ అనుమతిని రద్దు చేయాలని సిద్దరామయ్య హైకోర్టుకు వెళ్తే… ఎదురుదెబ్బ తగిలింది. ఈ లోపు .. అడ్వాంటేజ్ తీసుకుని సీబీఐని రంగంలోకి దింపుతారేమోన్న భయంతో జనరల్ కన్సెంట్ రద్దు చేశారు.
ఏదైనా ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేస్తే ఇలాగే ప్రభుత్వ పెద్దలపై కేసులు పెట్టడం సహజం. ముడా భూముల కేసు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిది. కానీ గవర్నర్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని గవర్నర్లు అలాగే ఉంటారు. ఇప్పుడు అంతా సిద్దరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. ఆయన రాజీనామా చేస్తే.. తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లు అవుతుంది. పైగా కాంగ్రెస్ సర్కార్ మరోసారి ఏర్పడుతుందా లేదా అన్న డౌట్.
అయితే బీజేపీ వదిలి పెడుతుందా లేదా అన్నదానిపైనా సందేహాలు ఉన్నాయి. సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసినా.. కోర్టు ఆదేశిస్తే సమస్యలు ఉండవు. ఒక వేళ సీబీఐ కాకపోతే బీజేపీ చేతిలో ఈడీ ఉంది. ఈడీకి ఎవరి పర్మిషన్లు అక్కర్లేదు. మొత్తానికి సిద్ధరామయ్యను బీజేపీ వెంటాడుతోంది.. వేటాడుతోంది. ఆయన తనను తాను ఎలా కాపాడుకుంటారో మరి !