నటుడు సిద్ధార్థ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చురుకు గా ఉంటున్నారు. అంతేకాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించడానికి వెనుకాడడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై , పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో మమత బెనర్జీ కి మద్దతు ఇవ్వడంపై గుర్రుగా ఉన్న బిజెపి అభిమానులు సిద్ధార్థ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దానిని సిద్ధార్థ కూడా దీటుగా ఎదుర్కుంటూ ఉన్నాడు అయితే తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి మరియు నటుడు సిద్ధార్థ మధ్య జరిగిన ట్వీట్ వార్ ఆసక్తి కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే..
Sidharth fims are funded by Dawood Ibrahim ? Answer … !
@Actor_Siddharth https://t.co/FzZEwHpxJM— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 5, 2021
బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి సిద్ధార్థను ట్యాగ్ చేస్తూ “ఈయన సినిమాలన్నీ దావూద్ ఇబ్రహీం ఫండింగ్ తో నిర్మించబడుతున్నాయి” అంటూ రాసుకొచ్చారు. దీనికి సిద్ధార్థ సమాధానం ఇవ్వాల్సిందిగా ఆయన సవాలు చేశారు. అయితే సిద్ధార్థ కూడా దానికి సమాధానం ఇస్తూ, తన పనులు చెల్లించడానికి దావూద్ ఇబ్రహీం సిద్ధంగా లేడని, తన టాక్స్ తానే చెల్లిస్తూ వస్తున్నానని, తాను ఒక పర్ఫెక్ట్ సిటిజన్ అని సమాధానం ఇచ్చారు. అక్కడితో ఆగకుండా విష్ణువర్ధన్‌రెడ్డి ని ఉద్దేశిస్తూ- నువ్వు బిజెపి రాష్ట్ర సెక్రటరీ అట కదరా, సిగ్గుండాలి, వెళ్లి పడుకో అని కౌంటర్ ఇచ్చారు.
https://twitter.com/Actor_Siddharth/status/1390401205860401156?s=19
నెటిజన్ల మద్దతు కూడా నటుడు సిద్ధార్థ కే లభించింది. ఈ విష్ణువర్ధన్ రెడ్డి ని తెలుగు ఛానల్స్ లో ఎవరో చెప్పు తో కొట్టినా కూడా ఆయనకు సిగ్గు రాలేదు అంటూ కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం ఇలా అసంబద్ధమైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అని, అరిగిపోయిన దావూద్ ఇబ్రహీం రికార్డు పట్టుకొని బీజేపీ నేతలు ఇంకెంతకాలం రాజకీయ మనుగడ కొనసాగిస్తారని , బిజెపి రాష్ట్ర సెక్రటరీ స్థాయి వ్యక్తి చేయవలసిన వ్యాఖ్యలు ఇవి కాదని విష్ణువర్ధన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు నెటిజన్లు.
ఏది ఏమైనా, కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా, వారిని తీవ్రవాదులుగా , దావూద్ ఇబ్రహీం సన్నిహితులు గా ముద్ర వేసే సంప్రదాయం సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది.