సిద్దార్థ్ అతిధిరావు హైదరీ మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ నడుస్తోందన్నది బహిరంగ రహస్యమే. ఎక్కడ చూసినా ఇద్దరూ జంటగా కనిపించేవారు. మేటరేంటని అడిగితే మాత్రం… నవ్వేసేవారు. `స్నేహితులం` అని చెప్పుకొనేవారు. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు మాత్రం బలంగా వినిపించేవి. వాటిని ఇప్పుడు నిజం చేసేశారు వీరిద్దరూ. అతిథిరావు, సిద్దార్థ్ ఇద్దరూ పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఈరోజు ఉదయం వనపర్తి జిల్లా రంగనాథ స్వామి వారి దేవాలయంలో వీరిద్దరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగిపోయిందని తెలుస్తోంది. ఈ వివాహానికి ఇరువురికి చెందిన అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే త్వరలోనే చెన్నైలో సిద్దార్థ్ ఓ విందు ఇవ్వబోతున్నాడని టాక్. మీడియా ముందుకు వచ్చి, తన ప్రేమ కథనీ, పెళ్లి కబురునీ చెప్పబోతున్నాడట. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మహా సముద్రం’లో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచీ ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. సిద్దూకి ఇది రెండో వివాహం. ఇది వరకు మేఘనతో పెళ్లయ్యింది. అయితే వీరిద్దరూ 2007లో విడిపోయారు. అతిధికి కూడా ఇది రెండో పెళ్లే.