సమాజ శ్రేయస్సు కోసం ఎంతమంది సినిమాలు తీస్తారో తెలియదు కాని వారి పరిస్థితిని పరిగణలో తీసుకుని సినిమా విడుదలను ఆపేసి తమిళ తంబీల మనసుని గెలుచుకునాడు హీరో సిద్ధార్థ్. చెన్నైలో అకాల వర్షాల కారణంగా కకా వికలమైంది అక్కడ పరిస్థితి అయితే ఇంకా అన్ని సమకూరాలంటే చాలా సమయమ పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో తన సినిమా విడుదల చేస్తే బాగోదని భావించిన సిద్ధార్థ్ సినిమాను వాయిదా వేసుకున్నాడు.
ఒక నెల రోజుల పాటు జిల్..జంగ్..జక్ అంటూ రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తూ సినిమా మీద మంచి హైప్ తీసుకువచ్చిన సిద్ధార్థ్ చెన్నైలో వరదల కారణంగా నానా తిప్పలు పడ్డ వారికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్స్ అంతా చెన్నై బాధితులకు అండగా ఉండి తమ మంచి మనసుని తెలియపరిచారు. అయితే అసలైతే జిల్.. జంగ్..జక్ సినిమా డిసెంబర్ 25 క్రిస్ మస్ రోజున విడుదల చేయాలని అనుకున్నా వాయిదా వేస్తున్నానని ప్రకటించాడు సిద్ధూ..
ప్రస్తుతం చెన్నైలో వర్షాలు ఆగినా జరిగిన నష్టం ఎంత అని తేల్చుకునే పనిలో ఉన్నారు. ప్రళయ తాండవంతో కొట్టిమిట్టాడిన మద్రాసు మహా పట్టనానికి చరిత్రలో గుర్తుండిపోయే ఒక మహా ఘట్టంగా ఈ పెను తుఫాను నిలిచిపోయింది.